విశ్వ బ్రాహ్మణులు ఐక్యంగా ముందుకు సాగాలి
కర్నూలు(అర్బన్): విశ్వ బ్రాహ్మణులు ఐకమత్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం ముందుకు సాగాలని బీసీ సంఘాల నేతలు కోరారు. మంగళవారం బ్రహ్మశ్రీ రావుసాహెబ్ పండిత గానాల రామమూర్తి 133వ జయంతి సందర్భంగా ఆయా సంఘాల నాయకులు స్థానిక బీసీ భవన్‌లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. ఆనంద్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు వై. నాగేశ్వరరావుయాదవ్, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, కులాల ఐక్యవేదిక కన్వీనర్ టి శేషఫణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండిత గానాల రామమూర్తి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎమ్మెల్సీగా ఉండి విశ్వ బ్రాహ్మణులను బీసీ కులాల్లో చేర్చిన మహనీయుడన్నారు. ఆయన చేసిన కృషి వల్లే నేడు విశ్వ బ్రాహ్మణులు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందుతున్నారన్నారు. కార్యక్రమంలో నేతలు నంది విజయలక్ష్మి, భరత్‌కుమార్, ఆస్పరి శ్రీనివాసులు, బ్రహ్మయ్య ఆచారి, చంద్రశేఖర్ ఆచారి, కుబేరస్వామి, విద్యార్థి నాయకులు రాజేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment