● మొదటి విడత పరీక్షలు
● పరీక్ష కేంద్రానికి రెండు గంటల ముందే వెళ్లాలి
కర్నూలు(సిటీ): దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు అర్హత కల్పించేందుకు ఉద్దేశించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ –20005 మొదటి సెషన్ పరీక్షలు ఈ నెల 22 నుంచి 30 వరకు జరుగనున్నాయి. 22, 23, 24, 28, 29 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌ల్లో పేపర్1( బీఈ, బీటెక్) ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. ఈ నెల 30న మధ్యాహ్నం పేపర్–2 బీఆర్క్ పరీక్ష జరుగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్డీఏ) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఆన్‌లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షలకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏ పరీక్ష కేంద్రం ఉందనే సమాచారంతో సిటీ ఇంటిమేషన్ వివరాలను సైట్‌లో ఉంచినట్లు జేఈఈ అధికారులు తెలిపారు. ఆయా తేదీల వారీగా జరిగే పరీక్షలకు మూడు రోజులు ముందుగా ఆడ్మిట్ కార్డులను విడుదల చేస్తుంది. బుధ, గురువారాల్లో జరగనున్న పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు సంబంధించిన అడ్మిట్ కార్డులను 18వ తేదీన విడుదల చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి రెండు గంటలు ముందుగానే చేరుకోవాల్సి ఉంది. దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఆధార్, పాన్ తదితర ఒరిజినల్ కార్డులు తీసుకెళ్లాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment