కర్నూలు(అగ్రికల్చర్): ప్రతి రైతుకు గుర్తింపు నెంబరు ఇచ్చే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఆధార్ తరహాలో రైతులకు యూనిక్ ఐడీ నెంబరు ఇచ్చేందుకు జిల్లాలో ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ(ఏపీఎఫ్‌ఆర్) పేరుతో నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఏపీఎఫ్‌ఆర్ పోర్టల్‌లో మండల వ్యవసాయ అధికారి,రైతు సేవా కేంద్రాల ఇన్‌చార్జీలను మ్యాపింగ్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 54 మండలాలు ఉండగా.. ఐదారు మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లో మ్యాపింగ్ చేసే ప్రక్రియ మొదలైంది. ఇంతవరకు రైతులకు ప్రత్యేక గుర్తింపు ఆనేది లేదు. వెబ్‌ల్యాండ్ డేటానే అందరికి ప్రామాణికం అయింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రతి రైతుకు ఒక యూనిక్ ఐడీ నెంబరు ఇవ్వడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్దమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాల అమలుకు యూనిక్ ఐడీ నెంబర్లే ప్రామాణికం అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment