గర్భిణుల వివరాలు వంద శాతం నమోదు చేయాలి
● జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారులను ఆదేశించిన కలెక్టర్
కర్నూలు(సెంట్రల్): గర్భం దాల్చిన మూడు నెలల్లోపే మహిళల వివరాలను వంద శాతం నమోదు చేసి ఆరో గ్య పరిస్థితిని పర్యవేక్షించాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా వైద్య, ఆరోగ్యశాఖాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ వైద్య, ఆరోగ్యశాఖాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంతాల్లో ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు ఉన్నా కొన్ని చోట్లా మూడు నెలల గర్భిణుల వివరాలను నమోదు చేయలేకపోతున్నారన్నారు. అభా ఐడీల జనరేషన్‌కు సంబంధించి 68 శాతం మాత్రమే పూర్తయిందని, ఇంకా 7 వేల మందికి కార్డులు ఇవ్వాల్సి ఉందన్నారు. టీనేజ్ ప్రెగ్నెన్సీలు ఎక్కువ గా నమోదవుతున్నాయని, అందుకు కారణాలను విశ్లేషించాలని, ఇందుకోసం డివిజన్ స్థాయిలో ఆర్‌డీఓ ఆధ్వర్యంలో సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. బాల్య వివాహాలతో టీనేజ్ ప్రెగ్నేన్సీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని, బాల్య వివాహాల నివారణకు చర్యలు తీసుకోవాని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ శాంతికళ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డైరక్టర్ శ్రీకృష్ణ ప్రకాష్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రమణ్యం, అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్ భాస్కర్, డీసీహెచ్‌ఎస్ మాధవి, మలేరియా అధికారి నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో
నైపుణ్యాలను వెలికితీయండి
విద్యార్థుల్లో దాగివున్న నైపుణ్యాలను వెలికితీయాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా ఉద్యోగ, ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో బాలోత్సవం– 2025 పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎక్కువ మంది బాలలను భాగస్వామ్యం చేయాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో బాలోత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు డి.ధనుంజయ, జేఎన్ శేష య్య, కెంగార మోహన్, జె.రంగస్వామి, హేమంత్ కుమార్, రవికుమార్, జయరాజు, సుధీర్ రాజు, ఎల్లా గౌడ్, సాయి ఉదయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment