కొనసాగుతున్న పోలీసు దేహదారుఢ్య పరీక్షలు
కర్నూలు: కర్నూలు ఏపీఎస్పీ రెండవ పటాలం మైదానంలో పోలీసు అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నా యి. పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూ లు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో బుధవారం 12వ రోజు 600 మందిని ఆహ్వానించారు. ఇందులో 415 మంది బయోమెట్రిక్ పరీక్షకు హాజరు కాగా వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత ఎత్తు, ఛాతీ చుట్టు కొలతలు వంటి ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్టులు నిర్వహించారు. అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్టులు 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ పరీక్షలు నిర్వహించారు. వాటిలో ప్రతిభ కనబరచి 286 మంది అభ్యర్థులు ప్రధాన పరీక్ష (మెయిన్స్)కు అర్హత సాధించారు. ఏదైనా సమస్యలపై ఇతర కారణాలతో అప్పీల్ చేసుకున్న అభ్యర్థులు ఈనెల 28వ తేదీన హాజరుకావాలని పోలీసు అధికారులు సూచించారు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు సెలవు దినాలు మినహా పోలీసు అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో ఎస్పీ బిందు మాధవ్‌తో పాటు సదరన్ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ మహేష్ కుమార్, అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, డీపీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రధాన పరీక్షకు 286 మంది ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment