రెవెన్యూ అధికారులపని విభజనపై అధ్యయనం
కర్నూలు(సెంట్రల్): జిల్లాల పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, సబ్ కలెక్టర్, ఆర్‌డీఓ, తహసీల్దార్ అధికారాల పంపిణీ, పని విభజన, బాధ్యతలపై అధ్యయనం చేస్తున్నట్లు సీసీఎల్‌ఏ కమిషనర్ జయలక్ష్మీ తెలిపారు. బుధవారం ఆమె విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయంపై గుంటూరు, కర్నూలు, చిత్తూరు జిల్లా కలెక్టర్లతో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయి అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
సంఘాల ఆర్థిక అభివృద్ధే ఎన్‌సీడీసీ లక్ష్యం
కర్నూలు(అగ్రికల్చర్): ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు వ్యాపారాభివృద్ధికి కట్టుదిట్టమైన ప్రణా ళికలు సిద్ధం చేసుకోవాలని ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాంకు సీఈఓ విజయకుమార్ తెలిపారు. బుధవారం కర్నూలు డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో పీఏసీఎస్‌లు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల సీఈఓలకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) శిక్షణా కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ... సొసైటీలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు ఎన్‌సీడీసీ అవకాశం కల్పిస్తోందని తెలిపారు. ఎన్‌సీడీసీ రీజినల్ డైరెక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ... ఇటువంటి సంఘాలకు ఎన్‌సీడీసీ మూడేళ్లలో రూ.15 లక్షల ఈక్విటీ గ్రాంటు (షేర్ క్యాపిటల్), మేనేజ్‌మెంటు గ్రాంటు రూ.18 లక్షలు ఇస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి ఎన్.రామాంజనేయులు, డీసీసీబీ జనరల్ మేనేజర్ పి.రామాంజనేయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment