ప్రజలందరికీ ఇంటి ముంగిటకే ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించేందుకు గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. అప్పట్లో ఈ వ్యవస్థ దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు స్వయం | - | Sakshi
Sakshi News home page

ప్రజలందరికీ ఇంటి ముంగిటకే ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించేందుకు గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. అప్పట్లో ఈ వ్యవస్థ దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు స్వయం

Published Fri, Jan 24 2025 2:03 AM | Last Updated on Fri, Jan 24 2025 2:03 AM

ప్రజల

ప్రజలందరికీ ఇంటి ముంగిటకే ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారద

కోడుమూరు మండలం పులకుర్తిలోని

గ్రామ సచివాలయం

హేతుబద్ధీకరణ సమంజసం కాదు

గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను హేతుబద్ధీకరణ పేరుతో వేధించడం సమంజసం కాదు. ఈ వ్యవస్థ పూర్వపు పంచాయతీ సమితి వ్యవస్థకు అనుగుణంగా రూపొందించారు. అప్పటి సమితిల్లో ప్రజలకు అవసరమైన అన్ని శాఖలకు సంబంధించిన ఎనిమిది మంది అధికారులు పనిచేస్తుండే వారు. ప్రస్తుత గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ కూడా అలాంటిదే. హేతుబద్ధీకరణతో ఉద్యోగులను గందరగోళానికి గురి చేయడం తప్ప మరొకటి కాదు. రాష్ట్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వం పునరాలోచించాలి.

– జీ జయపాల్‌రెడ్డి, రిటైర్డు జెడ్పీ సీఈఓ

ఉత్తర్వులు అందలేదు

గ్రామ/వార్డు సచివాలయల్లోని ఉద్యోగుల హేతుబద్ధీకరణకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు అందితే నియమ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం.

– జీ నాసరరెడ్డి, జెడ్పీ సీఈఓ

కర్నూలు(అర్బన్‌): హేతుబద్ధీకరణ పేరుతో సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులతో జాబ్‌చార్ట్‌లో లేని పనులను చేయిస్తూ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఉద్యోగుల కుదింపునకు శ్రీకారం చుడుతోంది. ఇందుకు ఇటీవల జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయమే సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే జిల్లా వ్యాప్తంగా వందలాది మంది సచివాలయ ఉద్యోగులు ఇతర శాఖలకు బదిలీ కానున్నారు. కొత్తగా భర్తీ చేయాల్సిన పోస్టులకు కూడా మంగళం పాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఉద్యోగుల్లో ఆందోళన

జిల్లా వ్యాప్తంగా 1,188 గ్రామ/వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 885 గ్రామ, 303 వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఈ సచివాలయాల్లో మొత్తం 10,035 ఉద్యోగులు ఉండాలి. అయితే ప్రస్తుతం 8,066 మంది మాత్రమే విధులు నిర్వహిస్తుండగా, 1,969 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్కో సచివాలయంలో 10 నుంచి 11 మంది వరకు ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2,500 కంటే జనాభా తక్కువ ఉన్న గ్రామ సచివాలయాల్లో ఆరుగురు, 2,500 నుంచి 3,500 మధ్య జనాభా ఉండే సచివాలయాల్లో ఏడుగురు, 3,500కు పైబడి జనాభా ఉండే సచివాలయాల్లో ఎనిమిది మంది ప్రకారం ఉద్యోగులను కొనసాగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి సచివాలయంలో ఇద్దరు, ముగ్గురి ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నట్లు తెలుస్తోంది. సగటున ఒక్కో సచివాలయం నుంచి ఎనిమిది మందిని లెక్కగట్టినా, 531 మందికి స్థాన చలనం కలగనుంది. వీరిని ఇతర శాఖలకు బదిలీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సచివాలయల్లో ప్రస్తుతం ఉన్న ప్రత్యేక సెక్రటరీకి బదులుగా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, పట్టణాల్లో వార్డు పరిపాలనా కార్యదర్శి హెడ్‌గా ఉంటారని ప్రభుత్వం చెబుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయ ఉద్యోగులకు అధిక ప్రాధాన్యత లభించేది. ప్రత్యేకంగా డిపార్టుమెంట్‌ పరీక్షలు నిర్వహించి అర్హత పొందిన వారికి పేస్కేల్స్‌ కూడా అమలు చేశారు. ఇప్పుడు తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అని పేస్కేల్స్‌ పొందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాలనా సంస్కరణలకు సమాధి!

గతంలో జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించి సచివాలయ ఉద్యోగులను అత్యంత పారదర్శకంగా ఎంపిక చేశారు. మెరిట్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడా పైరవీలకు తావు లేకుండా ఉద్యోగులను నియమించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొంది కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. ఈ వ్యవస్థలో కీలకమైన వలంటీర్లను స్థానిక అధికారులు ఎంపిక చేశారు. వీరందరు సమష్టిగా ప్రజలకు విశేష సేవలను అందించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన పాలనా సంస్కరణలకు సమాధి కట్టే ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్న వలంటీర్లను తొలగించి, నేడు సచివాలయ వ్యవస్థను అస్తవ్యస్తం చేసేందుకు చర్యలు చేపడుతోంది.

1,969 పోస్టులకు మంగళం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో జీరో వేకెన్సీకి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. ఆయా శాఖల్లో ఖాళీ అయిన ఉద్యోగాల భర్తీకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. వార్టు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 1,969 పోస్టుల భర్తీకి మూడో విడత నోటిఫికేషన్‌ జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రక్రియకు అప్పట్లో బ్రేకులు పడ్డాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపడుతున్న హేతుబద్ధీకరణ పూర్తి అయితే కొత్త పోస్టుల మాటెలా ఉన్నా, ఉన్న పోస్టులకు కూడా ఎసరు పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పునరావృతం కానున్న పాత కష్టాలు

గ్రామ/వార్డు వ్యవస్థ ఆవిర్భావానికి ముందు మూడు, నాలుగు గ్రామాలకు ఒక్క పంచాయతీ కార్యదర్శి మాత్రమే ఉండేవారు. వ్యవసాయ అసిస్టెంట్లు ఎక్కడో ఉండేవారో తెలియని పరిస్థితి. అవసరాలకు అనుగుణంగా సర్వేయర్లు లేకపోవడంతో కూడా పలు మండలాల్లో ఇంచార్జి సర్వేయర్లతో ప్రజలు ఇబ్బంది పడేవారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న హేతుబద్ధీకరణ నిర్ణయంతో పాత రోజులు పునరావృతం అయ్యే అవకా శాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేషనలైజేషన్‌తో కీలకమైన ఉద్యోగులు రెండు, మూడు గ్రామా లకు ఒకరు ప్రకారం పనిచేయాల్సిన పరిస్థితులు మళ్లీ రానున్నాయి. గ్రామాల్లో సర్వేయర్ల సమస్య తీవ్రంగా వేధించే అవకాశం కూడా లేకపోలేదు.

మూడు కేటగిరీలుగా విభజన

హేతుబద్ధీకరణ పేరుతో సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించేందుకు చర్యలు చేపట్టనుంది. మల్టీపర్పస్‌, టెక్నికల్‌, ఆస్పిరేషనల్‌ ఫంక్షనీర్లుగా విభజించి, జనాభా ఆధారంగా వారిని సచివాలయాలకు కేటాయించేందుకు కార్యాచరణను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ అసిస్టెంట్‌, మహిళా పోలీసు మల్టీపర్పస్‌ ఫంక్షనీర్లుగా వ్యవహరించనున్నారు. అలాగే సచివాలయాల్లో కేటాయింపుల అనంతరం మిగిలిన ఉద్యో గాల్లో ఆస్పిరేషనల్‌ ఫంక్షనీర్లను ఎంపిక చేస్తారు. ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) వంటి ఆధునిక సాంకేతికతను ప్రజల్లోకి తీసుకొని వెళ్లే కార్యక్రమాలకు వీరిని వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.

సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి

రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు

రేషనలైజేషన్‌ పేరుతో

ఉద్యోగుల కుదింపే లక్ష్యం

ప్రస్తుతం ఒక్కో సచివాలయంలో

11 మంది సిబ్బంది

6 నుంచి 8 మందితో

సరిపెట్టాలని యోచన

మిగిలిన వారిని ఇతర శాఖలకు

పంపేందుకు యత్నం

సచివాలయ ఉద్యోగుల వివరాలు...

జిల్లా సచివాలయాలు మంజూరైన పోస్టులు విధులు నిర్వహిస్తున్న వారు ఖాళీలు

కర్నూలు 672 5,738 4,256 1,482

నంద్యాల 516 4,297 3,810 487

మొత్తం: 1188 10,035 8,066 1,969

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రజలందరికీ ఇంటి ముంగిటకే ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారద1
1/2

ప్రజలందరికీ ఇంటి ముంగిటకే ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారద

ప్రజలందరికీ ఇంటి ముంగిటకే ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారద2
2/2

ప్రజలందరికీ ఇంటి ముంగిటకే ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement