అభివృద్ధి వివరాలను నమోదు చేయండి
● జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నిర్వహించే కుంభాభిషేకానికి దేశంలోని సప్త నదుల జలాలు తీసుకొచ్చారు. అలాగే స్వామి వారి ఆలయంలో ప్రతిష్టించే విజయగణపతి, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు గురువారం తమిళనాడులోని మహాబలిపురం నుంచి లారీలో క్షేత్రానికి చేరుకున్నాయి. విగ్రహాలు, సప్తనది జలాలు చేరుకోవడంతో డిప్యూటీ కమిషనర్ విజయరాజు, ప్రధాన, ఉపప్రధాన అర్చకులు ఈరప్పస్వామి, మహదేవస్వామి ప్రజలు ఊరేగింపు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. – కౌతాళం
కర్నూలు (సెంట్రల్): జిల్లాలోని ఆస్పిరేషనల్ బ్లాక్స్ (హొళగుంద, మద్దికెర, చిప్పగిరి) మండలాల్లో అభివృద్ధి వివరాలను తప్పని సరిగా పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఆస్పిరేషనల్ బ్లాక్స్ అభివృద్ధి పనుల పురోగతి, పోర్టల్‌లో అప్‌డేషన్‌పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా మండలాల్లో చేపట్టిన 41 సూచికలకు సంబంధించిన అభివృద్ధి పనుల వివరాలను త్వరితగతిన పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఐసీడీఎస్‌కి సంబంధించి పోషకాహారం లోపం ఉన్న ఐదేళ్ల లోపు పిల్లలకు ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ఇచ్చిన న్యూట్రీషన్ ఆహారం, తదితర వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. అంగన్ వాడీ కేంద్రాల్లో పెండింగ్‌లో ఉన్న టాయిలెట్లను, కుళాయి కనెక్షన్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీపీఓ భారతి, హౌసింగ్ పీడీ చిరంజీవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావు, ఆస్పిరేషనల్ బ్లాక్స్ మండలాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment