కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ధరలు నిరాశాజనకంగా ఉండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సారి ఎండుమిర్చి ధర అధ్వానంగా ఉంది. గురువారం మార్కెట్‌కు 610 క్వింటాళ్ల ఎండుమిర్చి వచ్చింది. కనిష్ట ధర రూ.1,229, గరిష్ట ధర రూ.14,239 లభించగా.. సగటు ధర రూ.12,449 నమోదైంది. మార్కెట్‌కు వాము తాకిడి పెరుగుతోంది. 394 క్వింటాళ్లు రాగా...కనిష్ట ధర రూ.2,469, గరిష్ట ధర రూ.21,288 లభించగా... సగటు ధర రూ.17,930 నమోదైంది.
● మార్కెట్‌కు ఉల్లి తాకిడి తగ్గిపోగా.. ధరలు పడిపోయాయి. మార్కెట్‌కు కేవలం 460 క్వింటాళ్లు రా గా.. కనిష్ట ధర రూ.1,480, గరిష్ట ధర రూ.2,565 లభించింది.సగటు ధర రూ.2,309 పలికింది.
● కందులు కనిష్ట ధర రూ.2,320, కనిష్ట ధర రూ.7,900 నమోదు లభించింది.
● కొర్రలు, సజ్జలు ధర నిరాశాజనకంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment