పురుగుల మందు తాగిన భార్యతట్టుకోలేక భర్త ఆత్మహత్యాయత్నం.. మృతి
సోమయ్యకుంటతండాలో విషాదం
రఘునాథపల్లి: బోరు వేసే విషయం.. అప్పుల బాధ భరించలేక భార్యాభర్తలు పురుగుల మందు తాగారు. భర్త మృతి చెందగా.. భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన ఆదివారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం సోమయ్యకుంటతండాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సోమయ్యకుంటతండా గ్రామానికి చెందిన కెతావత్ సంతోష్(36), సరోజన దంపతులకు ఇద్దరు కూతుళ్లు శైలు, నిహారిక, ఒక కుమారుడు లక్కి ఉన్నారు. వ్యవసాయంతో పాటు ట్రాలీ నడుపుతూ జీవనం గడుపుతున్నారు.
వారికి రెండెకరాల భూమి ఉండగా.. ఈ ఏడాది ఎకరంలో పత్తి సాగు చేశారు. మరో ఎకరంలో వరి సాగు చేసేందుకు నారు పోసి ఉంచాడు. వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటి బోరులో నీటి మట్టం తగ్గి వట్టిపోయింది. దీంతో మరో బోరు వేయాలని సంతోష్ భార్యకు చెప్పగా ఇప్పటికే అప్పులు ఎక్కువయ్యా యి.. బోరు వద్దంటూ నిరాకరించింది.
గతంలోనే హార్వెస్టర్, ట్రాలీ కొనుగోలుకు చేసిన అప్పులు ఉండగా, ప్రస్తుతం మరింత అప్పు చేశారు. అప్పు ఇచ్చిన వారు తరుచూ ఇంటికి వస్తుండటంతో భా ర్యాభర్తల మధ్య మూడు రోజులుగా గొడవ జరుగుతోంది. బోరు వేసే విషయంలో ఆదివారం ఉద యం మరోసారి గొడవ పడ్డారు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన సరోజన ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది.
గమనించిన భర్త, కుటుంబ స భ్యులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. భార్య పరిస్థితిని చూసి భర్త సంతోష్ తట్టుకోలేక ఆస్పత్రి నుంచి నేరుగా వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లి పురుగుల మందు తాగి తాను చనిపోతున్నట్లు బంధువుకు ఫో న్ చేసి చెప్పాడు. స్థానికులు వెళ్లి చూడగా అప్పటికే సంతోష్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిక్షించి అప్పటికే మరణించినట్లు నిర్ధారించా రు. మృతుడి తండ్రి జల్‌పత్ ఫిర్యాదు మేరకు ఎస్సై నరేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment