ఎలక్ట్రిక్‌.. నో పొల్యూషన్‌ | - | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌.. నో పొల్యూషన్‌

Published Sat, Nov 2 2024 12:50 AM | Last Updated on Sat, Nov 2 2024 12:50 AM

ఎలక్ట

ఎలక్ట్రిక్‌.. నో పొల్యూషన్‌

ఎలక్ట్రిక్‌ బస్సులో ప్రయాణికుల సౌకర్యాలు..

● వరంగల్‌ రీజియన్‌కు చేరుకున్న 34 కాలుష్యరహిత ఎలక్ట్రిక్‌ బస్సులు

● త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి

● అధునాతన సౌకర్యాలు..

● సిట్టింగ్‌ కెపాసిటీ.. సూపర్‌ లగ్జరీ బస్సులో 41, డీలక్స్‌లో 45, 2+2 సిట్టింగ్‌ ప్యాటర్న్‌, ఎక్స్‌ప్రెస్‌లో 55, 2+3 స్టిటింగ్‌ ప్యాటర్న్‌ ఎర్గోనామిక్‌గా డిజైన్‌ చేయబడిన సీట్లు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కోసం ఫ్రంట్‌ –రియర్‌ ఎయిర్‌ సస్పెన్షన్‌.

● నెల బ్యాకప్‌తో రెండు అంతర్గత భద్రతా కెమెరాలు, క్యాబిన్‌ లో ఒకటి, సెలూన్‌లో ఒకటి. ఒకటి ఫ్రంట్‌ వ్యూ కెమెరా, ఒకటి వెనుక వీక్షణ కెమెరా.

● వెహికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ –పానిక్‌ బజర్‌ ప్రొవిజన్‌.

● ప్రతి సీటుకు మొబైల్‌ చార్జింగ్‌ సదుపాయం.

● అంతర్గత ప్రకటన కోసం పబ్లిక్‌ అడ్రస్సింగ్‌ సిస్టమ్‌.

● ప్యాసింజర్‌ డోర్‌ కాకుండా నిష్క్రమణ కోసం రెండు అత్యవసర డోర్లు.

● డోర్‌ క్లోజింగ్‌లో యాంటీ–పించ్‌ ఫీచర్‌, ప్రయాణికుడు నిలబడితే డోర్‌ మూసివేయడానికి అనుమతించదు.

హన్మకొండ: వరంగల్‌ రీజియన్‌ రోడ్లపై తొలిసారి కాలుష్య రహిత ఎలక్ట్రిక్‌ బస్సులు పరుగులుపెట్టనున్నాయి. రీజియన్‌కు సూపర్‌ లగ్జరీ, డీలక్స్‌, సెమీ డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌.. మొత్తం 82 ఎలక్ట్రిక్‌ బస్సులు కేటాయించగా ఇప్పటి వరకు 34 చేరుకున్నాయి. అత్యాధునిక హంగులతో కూడిన ఈ బస్సులు ఈ నెలలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రధాన రూట్లలో తిప్పడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బస్సులకు చార్జింగ్‌ చేసేందుకు అవసరమైన విద్యుదీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సబ్‌ స్టేషన్‌ నిర్మాణం పూర్తి కావొచ్చింది. చార్జింగ్‌ స్టేషన్‌ పనులు కొనసాగుతున్నాయి.

డ్రైవర్‌ సౌకర్యాలు..

● ప్రభావవంతమైన బ్రేకింగ్‌, మెరుగైన స్థిరత్వం కోసం యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌తో ముందు, వెనుక డిస్క్‌ బ్రేక్‌లు.

● రివర్స్‌ పార్కింగ్‌ అలర్ట్‌ సిస్టమ్‌తో కూడిన రివర్స్‌ పార్కింగ్‌ సహాయక కెమెరా.

● డ్రైవర్‌ కోసం 7 కెమెరా డిస్‌ప్లేతో బస్‌ డ్రైవర్‌ కన్సోల్‌ (బీడీసీ).

● డ్యాష్‌ బోర్డులో ఉన్న క్లస్టర్‌లో డ్రైవర్లకు హెచ్చరిక సందేశాలు.

● వాహనం కదలిక కోసం డ్రైవ్‌, న్యూట్రల్‌, రివర్స్‌ బటన్‌, క్లచ్‌, గేర్‌ బాక్స్‌ ఉండదు.

● పవర్‌ స్టీరింగ్‌, ఎయిర్‌ కంప్రెషర్‌ ప్రత్యేక మోటార్ల ద్వారా బస్సులు నడపబడతాయి.

● సూర్యకాంతి నుంచి రక్షించడానికి డ్రైవర్‌ కోసం సన్‌ వైజర్‌ సౌకర్యం.

● ఫ్రంట్‌ విండ్‌ స్క్రీన్‌ గ్లాస్‌ నుంచి పొగమంచు తొలగించడానికి డిమిస్టర్‌ స్విచ్‌ సౌకర్యం

వాహన లక్షణాలు..

● వందశాతం విద్యుత్‌, జీరో కాలుష్యంతో 12 ఎంసీ బస్సు.

● పూర్తి చార్జింగ్‌తో 360 కి.మీ దూరం వెళ్తుంది.

● సింగిల్‌ పిన్‌ చార్జింగ్‌తో రెండున్నర గంటల్లో పూర్తి చార్జింగ్‌, డ్యూయల్‌ పిన్‌ చార్జింగ్‌తో ఒకటిన్నర గంటలు, గంట పాటు ఇంటర్మీడియట్‌ చార్జింగ్‌.

● ఫైర్‌ డిటెక్షన్‌ –అలారింగ్‌ సిస్టమ్‌ (ఎఫ్‌డీఏ).

● 12 హైఓల్టేజ్‌ (హెచ్‌వీ) బ్యాటరీలు, రెండు లోఓల్టేజ్‌ (ఎల్‌వీ) బ్యాటరీలు.

● బస్సు గరిష్టంగా 80 కి.మీ.కి స్పీడ్‌ లాక్‌.

● వాహన ట్రాకింగ్‌, కెమెరాలు, ఎల్‌ఈడీ డిస్‌ ప్లే బోర్డులు, జీపీ ఆధారిత ప్రకటనలతో కూడిన ఇంటెలిజెంట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌.

● హాల్ట్‌ బ్రేక్‌ సిస్టమ్‌, ప్రయాణికుల, డ్రైవర్‌ తలుపులు తెరిచి ఉంటే వాహనం కదలికను నివారిస్తుంది.

● బ్యాటరీ కూలింగ్‌ సిస్టమ్‌, ట్రాక్షన్‌ మోటార్‌ కూలింగ్‌ సిస్టమ్‌ కలదు.

● రెండు ఎమర్జెన్సీ పవర్‌ కట్‌ ఆఫ్‌ స్విచ్‌లు. డ్రైవర్‌ దగ్గర ముందు ఒకటి, వెనుక మరోటి

ఈ నెలలో ప్రయాణికుల ముంగిటకు..

కాలుష్యరహిత ఎలక్ట్రిక్‌ బస్సులు ఈ నెలలో ప్రజల ముంగిటకు రానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులు హైదరాబాద్‌, నిజామాబాద్‌, ఏటూరునాగారం, మంగపేట, ఖమ్మం, భూపాలపల్లి రూట్లలో నడపనున్నాం. అత్యాధునిక హంగులతో ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

– డి.విజయభాను, ఆర్‌ఎం,

ఆర్టీసీ వరంగల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
ఎలక్ట్రిక్‌.. నో పొల్యూషన్‌1
1/1

ఎలక్ట్రిక్‌.. నో పొల్యూషన్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement