పండుగ పూట విషాదం..
రఘునాథపల్లి: దీపావళి పండుగ పూట విషాదం నెలకొంది. హనుమకొండ– హైదరాబాద్ జాతీయ రహదారిపై గోవర్ధనగిరిలో యూటర్న్ వద్ద రోడ్డు దాటుతున్న టీవీఎస్ ఎక్సెల్ (బైక్)ను గుర్తు తెలి యని కారు ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరికి చెందిన సంపతి నారాయణరెడ్డి, జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన కడార్ల రవీందర్ గోవర్ధనగిరి శివారులోని ఆయిల్ కంపెనీలో ఒకరు సెక్యురిటీ గార్డుగా మరొకరు సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నారు. గురువారం రాత్రి విధులు ముంగించుకుని నారాయణరెడ్డి తన టీవీఎస్ ఎక్సెల్‌పై రవీందర్‌తో కలిసి స్వగ్రామాలకు బయలుదేరారు. జాతీయ రహదారిపై గోవర్ధనగిరిలో యూటర్న్ వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో హనుమకొండ నుంచి జనగామకు వస్తున్న గుర్తు తెలియని కారు.. ఎక్సెల్‌ను ఢీకొంది. దీంతో ఎక్సెల్‌పై ఉన్న ఇరువురు ఎగిరి రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. కాగా, ప్రమాదానికి కారణమైన కారు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కుటుంబ సభ్యులు నారాయణరెడ్డి మృతదేహంపై పడి రోదించిన తీరు అందరిని కలిచి వేసింది. మృతుడికి భార్య మదనమ్మ, కుమారుడు, కూతురు ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే నారాయణరెడ్డి, రవీందర్ మృతి చెందడంతో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మృతుడు నారాయణరెడ్డి కుమారుడు అనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.
నివారణ చర్యలు శూన్యం..
జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాల జరుగుతు న్నా వాటి నివారణకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు విని పిస్తున్నాయి. ప్రమాద స్థలంలో సరిగా హెచ్చరిక రేడియేషన్ లేకపోవడం, లైట్లు లేక అంధకారం నెలకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థాని కులు చెబుతున్నారు. మీదికొండకు వెళ్లే ఈ యూ టర్న్ వద్ద రోడ్డు దాటడం ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ ఇప్పటికే ఏడుగురు మృతి చెందారు. కొందరు గాయపడ్డారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని గోవర్ధనగిరి గ్రామస్తులు కోరుతున్నారు.
బైక్‌ను ఢీకొన్న కారు
ఇద్దరు కార్మికుల దుర్మరణం
గోవర్ధనగిరిలో ఘటన
శోకసంద్రంలో బంధువులు
Comments
Please login to add a commentAdd a comment