చేయిచేయి కలిపారు.. ఆలయం నిర్మించారు | - | Sakshi
Sakshi News home page

చేయిచేయి కలిపారు.. ఆలయం నిర్మించారు

Published Sat, Nov 2 2024 12:50 AM | Last Updated on Sat, Nov 2 2024 12:50 AM

చేయిచ

చేయిచేయి కలిపారు.. ఆలయం నిర్మించారు

ఆత్మకూరు: గ్రామస్తులంతా చేయిచేయి కలిపారు. వెయ్యేళ్ల ఆలయానికి జీర్ణోద్ధరణ చేశారు. రూ.3 కోట్ల భక్తుల విరాళాలతో మండల కేంద్రంలో కాకతీయుల కాలంలో నిర్మించిన మహిమాన్విత పంచకూట శివాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన స్థపతులు ఈ ఆలయాన్ని నిర్మించారు.

చారిత్రక నేపథ్యం..

ఆత్మకూరు గ్రామంలోని మహిమాన్విత పార్వతిదేవి సమేత మహాదేవ పంచకూట శివాలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించారు. కాకతీయుల పాలనలో త్రికూట ఆలయాలు ఎక్కువ నిర్మించారు. అయితే ప్రత్యేకంగా ఆత్మకూరు గ్రామంలో పంచకూట శివాలయాన్ని నిర్మించడం విశేషం. ఆలయంలో దక్షిణముఖంగా ఉన్న ప్రధాన ద్వారంలోపల గర్భగుడిలో శివలింగం ప్రతిష్ఠించారు. ప్రధాన గర్భగుడికి కుడివైపు రెండు గర్భగుడుల్లో రెండు శివలింగాలు, ఎడమ వైపు రెండు గర్భగుడుల్లో రెండు శివలింగాలు ప్రతిష్ఠించారు. ఈ ఐదు లింగాలను పంచభూతాలకు ప్రతీకలుగా ఏర్పాటు చేశారని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొన్నారు. భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా పంచకూట ఆలయాన్ని కాకతీయులు నిర్మించగా అదే స్థలంలో భక్తులు కమిటీ ఏర్పాటు చేసుకుని పూర్తిగా రాతితో నిర్మించారు. 1250 సంవత్సరం నాటి కంఠాత్మకూ రు శాసనంలో పంచకూట ఆలయ వైశిష్ట్యాన్ని పొందుపర్చారు. కాకతీయ రాజులు, సామంతులు, జగద్గురువులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేశారని పూర్వీ కులు చెబుతున్నారు.ఆలయంలో నంది, వినాయకుడు, కుమారస్వామి విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు.అలాగే, పార్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు.ఆలయంలో ధ్వజస్తంభం, ఆవరణలో నవగ్రహాలను ప్రతిష్ఠించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయాన్ని పునఃనిర్మించాలని సంకల్పించి 2019 డిసెంబర్‌11న భూమిపూజ చేశారు. ఐదు సంవత్సరాల అనంతరం ఈనెల 8న ఆలయం పునఃప్రతిష్ఠ జరగనుంది. ఈ ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఆలయ పునఃప్రతిష్ఠాపన మహోత్సవాల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.

వెయ్యేళ్ల ఆలయానికి జీర్ణోద్ధరణ

రూ. 3 కోట్ల భక్తుల విరాళాలతో పనులు

పూర్తిగా రాతితో అద్భుత నిర్మాణం

No comments yet. Be the first to comment!
Add a comment
చేయిచేయి కలిపారు.. ఆలయం నిర్మించారు1
1/1

చేయిచేయి కలిపారు.. ఆలయం నిర్మించారు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement