పలిమెల : ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందా డు. ఈ ఘటన మండలంలోని సర్వాయిపేటలో చో టు చేసుకుంది. ఎస్సై తమాషారెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆకుదారి ప్రశాంత్ (17) మిత్రులతో కలిసి మంగళవారం గోదావరి నదిలోకి ఈతకు వెళ్లాడు. అయితే ప్రశాంత్‌కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ఎంతకూ పైకి తేలలేదు. దీంతో మిత్రులు.. ప్రశాంత్ గల్లంతైన విషయం కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వారు స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం సాయంత్రం మృతదేహం లభ్యమైంది. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహదేవ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నట్లు ఎస్సై తమాషారెడ్డి తెలిపారు.
సాంకేతిక లోపంతో
నిలిచిన గూడ్స్
డోర్నకల్: డోర్నకల్ మీదుగా విజయవాడ వైపునకు వెళ్తున్న గూడ్స్ రైలులో సాంకేతిక లోపం తలెత్తి మెయిన్ లైన్‌లో నిలిచింది. దీంతో బుధవారం పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. గూడ్స్ డోర్నకల్ నుంచి బయలుదేరి పాపటపల్లి స్టేషన్ సమీపిస్తుండగా రైలులో సాంకేతిక సమస్య తలెత్తి మెయిన్‌లైన్‌లో ని లిచింది. దీంతో డోర్నకల్ నుంచి విజయవాడకు వె ళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ బుగ్గవాగు సమీపంలో, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ డోర్నకల్ స్టేషన్‌లో నిలిచాయి. మరో ఇంజిన్‌ను పంపి మెయిన్‌లైన్‌లో నిలిచిన గూ డ్స్‌ను పాపటపల్లి స్టేషన్‌కు తరలించారు. అనంత రం సుమారు 1.20 గంటల పాటు నిలిచిన కృష్ణా ఎక్స్‌ప్రెస్, డోర్నకల్‌లో అరగంట నిలిచిన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఖమ్మం వైపునకు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment