No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Thu, Nov 21 2024 1:10 AM | Last Updated on Thu, Nov 21 2024 1:10 AM

-

హన్మకొండ: సీఎం రేవంత్‌ రెడ్డివి చిల్లర మాటలని, ఆయనొక చీటర్‌, బ్రోకర్‌ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తూర్పారబట్టారు. బుధవారం హనుమకొండ రాంనగర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్‌ అనే మొక్కను మొలవనివ్వవా.. గంజాయి మొక్కలాంటి నిన్ను పీకి అవతల పారేస్తామన్నారు. అబద్ధాలు, మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చి సీఎం అయ్యావన్నారు. ‘నన్ను రాక్షసుడన్నావు.. అవును నేను రాక్షసుడినే. పని చేసే రాక్షసుడిని.. నా ప్రజల కోసం ఏమైనా చేస్తా’ అని అన్నారు. నీ మాటలు నమ్మి ఓటేసిన ప్రతీ ఒక్కరిని మోసం చేశావన్నారు. సీఎం హోదాలో ఏమీ మాట్లాడుతున్నావో సోయి ఉందా అని ప్రశ్నించారు. విజయోత్సవ సభలు పెట్టుకోవడం కాదు.. నమ్మి ఓటేసిన ప్రజల సమస్యలు పట్టించుకో అని హితవు పలికారు. నాడు సోనియాను బలిదేవత అని, నేడు దేవత అని ఆమె కాళ్లు కడిగి నీళ్లు చల్లుకుంటానని మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేసీఆర్‌ వల్లే కాళోజీ కళాక్షేత్రం అద్భుతంగా నిర్మితమైందన్నారు. శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ ఇందిర మహిళా శక్తి విజయోత్సవ సభ వంచన సభ అని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌ దుర్మార్గంగా మాట్లాడారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి 5 ఏళ్లు కొనసాగలేదని, రేవంత్‌ రెడ్డికి కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైందన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ విజయోత్సవ సభలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు చేస్తున్నట్లు ప్రకటిస్తారని ఆశించిన వారికి భంగం కలిగిందని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ రేవంత్‌ రెడ్డి, అతడి అనుచరులు చిల్లర మాటలు బంద్‌ చేయాలన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్‌ మాట్లాడారు. సమావేశంలో గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్‌ గాంధీ నాయక్‌, నాయకులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement