చిప్‌లు గట్టిపడి పనితనం మందగిస్తుంది
● మంచుకురిసే ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్ ఉపయోగించొద్దు
● మయూర్, ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్, హనుమకొండ
హన్మకొండ చౌరస్తా: ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలలో పడిపోయినప్పుడు కంప్యూటర్లు, మొబైళ్లు, బ్యాటరీ, ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్లలో ఉండే మెటల్ కాంట్రాక్ట్‌లు ప్రభావితం అవుతాయి. ఎలక్ట్రానిక్స్ వస్తువుల లోపల ఉండే చిప్‌లు మైనస్ టెంపరేచర్‌లో గట్టిపడి పనితనం మందగిస్తుంది. అయితే బయటి దేశాలతో పోల్చితే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లోని చలితీవ్రత చాలా తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. దీని వల్ల ఎలక్ట్రానిక్స్ వస్తువులపై అంతగా ప్రభావం ఉండదు. అలాగని మంచు కురిసే సమయంలో బయటి ప్రదేశాల్లో ల్యాప్‌టాప్, మొబైళ్లను వాడితే తెలియకుండానే మంచు లోపలికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. నీటి తడితో విడిభాగాలు పూర్తిగా పాడవుతాయి. మంచు కురిసే ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్ వస్తువుల వినియోగాన్ని తగ్గించడం మంచిది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు కంప్యూటర్లు, మొబైళ్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువుల విడిభాగాలపైన కొంత ప్రభావం చూపుతుంది తప్పితే సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. కీప్యాడ్ మొబైళ్లు కొంత బిగుసుకుపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడంతా స్మార్ట్ ప్రపంచం. మొబైల్ బాగా వేడి అయినప్పుడు స్విచ్‌ఆఫ్ చేయడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment