అప్పుల బాధతో రైతు బలవన్మరణం
గూడూరు: అప్పుల బాధతో ఓ రైతు పంట పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమ్మెట లోకయ్యగౌడ్ (48) గీత వృత్తితో పాటు తనకు ఉన్న రెండు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. తనకు ఇద్దరు కూతుళ్లు ఉండగా.. రెండేళ్ల క్రితం పెద్ద కూతురు, ఏడాదిక్రితం చిన్న కూతురు పెళ్లిళ్లు చేశాడు. ఈక్రమంలో కొంత అప్పు చేశాడు. కొంతకాలంగా వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో కుటుంబ ఖర్చులు, అప్పుల బాధ ఎక్కువైంది. భార్య పిల్లలతో అప్పులు ఎలా తీర్చాలంటూ నెల రోజులుగా మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పంట పొలం వద్దకు వెళ్లిన లోకయ్యగౌడ్ చెట్టుకు ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment