అంత్యక్రియలకు వెళ్లి అనంతలోకాలకు..
మరిపెడ రూరల్/కొడకండ్ల: ఓ యువకుడు బంధువు అంత్యక్రియలకు వెళ్లాడు. అక్కడ స్నేహితుతో కలిసి సరదాగా కారులో బ యటకు వెళ్లి శవమయ్యాడు. మృతుడి బంధువుల కథనం ప్రకా రం.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం డీఎస్‌ఆర్‌జండాల్ తండా జీపీలోని కొమటికుంటతండాకు చెందిన బానోత్ సుమన్ (26) ఖమ్మం జిల్లా కాకరవాయిలో మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో జనవరి 1వ తేదీన తన మామ ఊరు మహబూబాబాద్ జిల్లా కేంద్రం ఇందిర కాలనీ సింగిలాల్‌తండాలో బంధువు అంత్యక్రియలకు వెళ్లాడు. అక్కడ బంధువులు ధరావత్ దేవాదాసు, ధరావత్ ప్రశాంత్, భూక్య వినోద్, మూడ్ వినోద్‌తో కలిసి కారులో అదే రోజు రాత్రి సరదాగా బయటకు వెళ్లారు. ఈ నేపథ్యంలో వీరు ప్రయాణిస్తున్న కారు జనగామ జిల్లా కొడకండ్ల మండలం రేగుల గ్రామ సమీపంలో ఓ చెట్టును ఢీకొంది. డ్రైవర్ పక్కన ముందు సీట్లో కూర్చున్న సుమన్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నలుగురు వ్యక్తులు సుమన్ మృతదేహాన్ని అదే కారులో మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు. సింగిలాల్‌తండాలోని మృతుడి మామ ఇంటి ఎదుట పార్క్ చేసి పరారయ్యారు.
నా కొడుకును చంపేసి రోడ్డు ప్రమాదంగా
చిత్రీకరిస్తున్నారు
‘పథకం ప్రకారమే నా కొడుకును నలుగురు కలిసి కారులో బలంతంగా బయటకు తీసుకెళ్లారు. అక్కడ ఏ జరిగిందో ఏమో కొడుకు శవాన్ని తీసుకొచ్చి నా బావమరిది ఇంటి వద్ద ఉంచి నలుగురు పరారయ్యారు’ అని మృతుడి తండ్రి బానోత్ దేవుజా ఆరోపించాడు. పరారీలో ఉన్న వారికి ఫోన్ చేస్తే చెట్టుకు కారు ఢీకొందని, ఎదురుగా మరో కారు ఢీకొట్టడంతో దానిని వెంబడించామని పొంతన లేని సమాధానం చెబుతున్నారని, వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యాడు. మృతుడికి భార్య అనసూర్య, 3 సంవత్సరాల కుమారుడు, ఏడాది కుమార్తె ఉన్నారు. కాగా, ఈ ఘటనపై మృతుడి తండ్రి దేవుజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొడకండ్ల ఎస్సై రాజు గురువారం తెలిపారు.
చెట్టును ఢీకొన్న కారు.. యువకుడి మృతి
జనగామ జిల్లా
కొడకండ్ల మండలంలో ఘటన
చంపేసి కారు ప్రమాదంగా
చిత్రీకరిస్తున్నారని మృతుడి తండ్రి ఆరోపణ
Comments
Please login to add a commentAdd a comment