గోదాదేవి నీరాటోత్సవాలు షురూ
మహబూబాబాద్ రూరల్: ధనుర్మాస వ్రత మహోత్సవ పూజా కార్యక్రమాల్లో భాగంగా గోదాదేవి అమ్మవారి నీరాటోత్సవాలు (పెళ్లి కుమార్తెను చేసే వేడుకలు) శనివారం ప్రారంభమయ్యాయి. పట్టణంలోని శ్రీరామ ఆలయంలో అర్చకులు ఎంవీ.కృష్ణప్రసాద్, ముడుంబై లక్ష్మీనారాయణ చార్యులు ప్రత్యేకంగా రథంపై గోదాదేవి అమ్మవారిని ఆలయంలో మంగళ వాయిధ్యాలతో ఊరేగింపు చేశారు. అనంతరం గోదాదేవి అమ్మవారిని వేదికపై కొలువుదీర్చి పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. పట్టువస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరణ చేసి, అర్చన, అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు తమ ఇళ్ల వద్ద నుంచి మంగళహారతులు, పూజా సామగ్రితో హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment