ఎరువుల దుకాణాల తనిఖీ
కురవి: మండలంలోని మోద్గులగూడెంలోని ఎరువుల దుకాణాలతోపాటు కురవిలోని ది ఆంధ్రాబ్యాంకు కర్షక సేవా సహకార సంఘాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల ఆకస్మికంగా శనివారం తనిఖీలు చేశారు. మోద్గులగూడెంలోని ఎరువుల దుకా ణాలను తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్లు, మందులను పరిశీలించారు. కురవిలోని సొసైటీలోని రికార్డులను పరిశీలించారు. ఆమె వెంట మండల వ్యవసాయ శాఖ అధికారి నర్సింహరావు, ఏఈఓ విజేందర్, సొసైటీ అధికారి నర్సింహరెడ్డి తదితరులు ఉన్నారు.
నేటి నుంచి శిక్షణ తరగతులు
మహబూబాబాద్ రూరల్: అఖిల భారత గిరిజన ఆదివాసీ కాంగ్రెస్ ప్రతినిధుల శిక్షణ తరగతులు నేటి (ఆదివారం) నుంచి ప్రారంభంకానున్నాయని ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ గుగులోత్ వెంకట్‌నాయక్ శనివారం ఒక ప్రటకనలో తెలిపారు. ఆదివాసీ ట్రైబల్‌కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ డాక్టర్ తేజావత్ బెల్లయ్యనాయక్ అధ్యక్షతన నాగార్జునసాగర్ పట్టణంలో ఈ నెల 11వ తేదీ వరకు శిక్షణా తరగతులు జరగనున్నాయన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ బాధ్యులు ఎంపిక చేసిన ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ముఖ్యనేతలు హాజరు కానున్నారన్నారు.
మెరుగైన వైద్యసేవలు
అందించాలి
గూడూరు: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జి.మురళీధర్ అన్నారు. మండలంలోని అయోధ్యపురం పీహెచ్‌సీని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో నిర్వహించే పలు వైద్య సేవలు, రిజిస్టర్లను పరిశీలించారు. జాతీయ సేవా కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. అనంతరం గూడూరు సబ్ సెంటర్ 1ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రమీలారావు, ప్రోగ్రాం ఆఫీసర్ సారంగపాణి, పీహెచ్‌సీ డాక్టర్ యమున, సిబ్బంది రామకృష్ణ, లవరాం, సర్ధార్‌బాబు, లాలు తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీ గురుకులాల్లో
అక్రమాలపై కలెక్టర్ ఆరా
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల్లో ‘అధికారుల ఇష్టారాజ్యం’ అనే శీర్షికన శనివారం కథనం ప్రచురితమైన విషయం విధితమే. దీంతో కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్ జిల్లా మైనార్టీ అధికారితో సమావేశం నిర్వహించారు. మైనార్టీ గురుకులంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు ఎలా చేపడుతున్నారనే స్పష్టత కావాలని సూచించారు. ఆయా నియామకాలపై నివేదిక అందించాలని సూచించినట్లు సమాచారం.
రామప్పలో వీకెండ్ సందడి
● అధికసంఖ్యలో తరలివచ్చిన
పర్యాటకులు, విద్యార్థులు
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయంలో శనివారం వీకెండ్ సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు పర్యాటకులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి విద్యార్థులు భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. ఆలయంలోని పలు శిల్పాల వద్ద గ్రూప్ ఫొటోలు దిగి సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment