జాతరలో సౌకర్యాలు కల్పించాలి
ములుగు : మేడారం సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో భక్తుల అవసరాలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క సూచించారు. ఈ మేరకు మంగళవారం జిల్లాకేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో వచ్చే నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనున్న మేడారం మినీ జాతరపై కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీశ్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్ర, డీఎఫ్‌ఓ రాహుల్‌కిషన్ జాదవ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. నాణ్యతతో పనులు చేపట్టి శాశ్వతంగా నిలిచిపోయేలా చూడాలన్నారు. మహా జాతరలో సంఘటనలు పునరావృతం కాకుండా చ ర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే భక్తుల రాక పెరిగిందని, ఫిబ్రవరి మొదటివారం నుంచి మరింత తాకిడి ఎక్కువవుతుందన్నారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు క్యూలైన్లు, తాగునీటి సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కడ లోపం లేకుండా ప్రతీ ప్రాంతం శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని డీపీఓ దేవరాజ్‌ను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, మరుగుదొడ్లను ఉపయోగంలోకి తీసుకురా వాలని సూచించారు. జంపన్నవాగు వద్ద నల్లాలు ఏర్పాటు చేసి, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక షెడ్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. సమావేశంలో దేవాదాయశాఖ ఈఓ రాజేందర్, డీఎస్పీ రవీందర్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
మినీ మేడారంపై సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment