మార్కెట్ సమస్యలు పరిష్కరించండి
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లోని సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా స్‌రెడ్డిని తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు మంత్రిని హైదరాబాద్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కలసి వరంగల్ వ్యవసాయ మార్కెట్ రైతులు, హమాలీలు, కార్మికులు, వ్యాపారుల ఇబ్బందులు, సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు, ఇంటర్నెట్ వైఫై, ఇంటిగ్రేటెడ్ వెయింగ్ మిషన్లు పనిచేయకపోవడం వల న ఎదురవుతున్న ఆటంకాలను వివరించారు. అలాగే, వ్యవసాయ మార్కెట్‌కు 15 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న రైతు సరుకుల ప్రాసెసింగ్ పరిశ్రమలకు సరుకు రవాణా చేసేందుకు రోడ్ల నిర్మాణం చేపట్టాలని అభ్యర్థించారు. వ్యవసాయ మార్కెట్‌లో చాంబర్ ఆఫ్ కామర్స్‌కు కేటాయించిన స్థలానికి నామమాత్రపు లీజు నిర్ణయించి రైతు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ట్రేడ్ ప్రమోషన్ సెంటర్ నిర్మాణానికి అనుమతించాలని కోరారు. జిల్లాలో వ్యాల్యూ యాడెడ్ పరిశ్రమల అభివృద్ధికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించి జిల్లా అభివృద్ధికి తోడ్పాటునందించాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు రవీందర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కటకం పెంటయ్య, అల్లే సంపత్, చింతలపల్లి వీరారావు, లింగారెడ్డి, రాజేశ్, కరాణి, గోని సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చాంబర్ ప్రతినిధులు వినతి
Comments
Please login to add a commentAdd a comment