ఐలోని జాతరను విజయవంతం చేయాలి
ఐనవోలు : భక్తులకు వసతుల కల్పనలో ఎక్కడా కాంప్రమైజ్ కావొద్దు.. గతంలో కంటే వైభవంగా జాతరను విజయవంతం చేయాలి.. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావొద్దని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆలయ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే అధ్యక్షతన మల్లికార్జున స్వామివారి ఆలయ ప్రాంగణంలోని అన్నదాన సత్రంలో జాతరపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులు మేయర్ గుండు సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో పాటు కలెక్టర్ ప్రావీణ్య, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముందుగా ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు చేపట్టాల్సిన పనులను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే ఒక్కో శాఖను రివ్యూ చేశారు. మహిళా భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్న అంశానికి కలెక్టర్ ప్రావీణ్య స్పందించి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లను తక్షణమే ప్రారంభించాలని అందుకు తగిన నిధులు మంజూరు చేస్తామన్నారు. మేయర్ సుధారాణి, ‘కుడా’ చైర్మన్ వెంకట్రాంరెడ్డి మాట్లాడారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వీడియో కాల్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే నాగరాజు విజ్ఞప్తి చేశారు. కాగా, చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్దేశం చేస్తూ జాతరను విజయవంతం చేయాలని మంత్రి సురేఖ పిలుపునిచ్చారు. అయితే నిధుల గురించి మాత్రం స్పందించలేదు. అనంతరం పున్నేలు క్రాస్ వద్ద నిర్మించిన డబుల్ ఆర్చి గేట్‌ను ప్రారంభించారు.అలాగే లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ అప్పయ్య, డీసీపీ పులిగిల్ల రవీందర్, ఆర్‌డీఓ రమేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, జాతర అభివృద్ధికి నిధుల మంజూరుపై విలేకరుల అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ప్రభుత్వం ఈసారి ఎలాంటి నిధుల కేటాయించలేదన్నారు.
ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు కావాలి
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కోరిన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు
Comments
Please login to add a commentAdd a comment