ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
మహబూబాబాద్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రతిఒక్కరికీ రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర, బీసీ, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నుంచి రోడ్డు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్‌తో కలిసి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతీశాఖను భాగస్వామ్యం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ గ్రామంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత విద్యార్థులచే ర్యాలీలు నిర్వహించాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. రోడ్డు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్ మాట్లాడుతూ జనవరి నెల అంతా రోడ్డు భద్రతా ప్రమాణాల కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. వీసీలో కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ కె వీరబ్రహ్మచారి, అధికారులు పాల్గొన్నారు.
వీసీలో మంత్రి పొన్నం ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment