వినతులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన వినతుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో వినతులను స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. పరిష్కారం సాధ్యం కాకపోతే కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని అధికారులు గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వినతులు పరిష్కరించి వారికి నమ్మకం కలిగించాలన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
సృజనాత్మకతను వెలికి తీయాలి
విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి సైన్స్‌ఫెయిర్ లాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపికై న విద్యార్థులు సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి బస్సులో బయలుదేరగా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈనెల 6నుంచి 9వరకు జరిగే రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు జిల్లా నుంచి విద్యార్థులు వెళ్తున్నారని చెప్పారుజ గైడ్ టీచర్లు, విద్యార్థులు కలిసి 37 మంది వెళ్తున్నారని చెప్పారు. రాష్ట్రస్థాయిలో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఈఓ రవీందర్‌రెడ్డి, డీపీఆర్వో రాజేంద్రప్రసాద్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, సంకా బద్రినారాయణ, లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వే పరిశీలన..
కురవి: మండల కేంద్రంతోపాటు అయ్యగారిపల్లి గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ సోమవారం సాయంత్రం పరిశీలించారు. పలువురి ఇళ్లకు వెళ్లి సర్వే చేస్తున్న అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వం సూచించిన షెడ్యూల్ ప్రకారం సర్వే నిర్వహిస్తున్నామని, ఎలాంటి పొరపాట్లు లేకుండా డాటా ఎంట్రీ చేస్తామని తెలిపారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సునీల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment