విద్యార్థినులకు కరాటేలో గోల్డ్‌మెడల్
బయ్యారం: మండలంలోని ఉప్పలపాడు ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఓపెన్ నేషనల్ కరాటే పోటీలో గోల్డ్‌మెడల్ సాధించారు. ఈ నెల 5న ఖమ్మంలో జరిగిన పోటీల్లో తొమ్మిదో తరగతి విద్యార్థినులు రక్షిత, మానస, దీక్ష, కావేరి ప్రతిభ కనపర్చి గోల్డ్‌మెడల్ పొందారు. కాగా విద్యార్థినులను సోమవారం పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్, ఉప్పలయ్య, చారి, కరాటే కోచ్ విజయనిర్మల అభినందించారు.
చలో కలెక్టరేట్‌ను
జయప్రదం చేయండి
నెహ్రూసెంటర్: అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు (మంగళవారం) చేపట్టనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చిర్ర లక్ష్మీనర్సమ్మ, ఎల్లారీశ్వరి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంగన్‌వాడీలకు కనీస వేతన హామీని అమలు చేయాలని,ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని,పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చే యాలని డిమాండ్ చేశారు.అంగన్‌వాడీలు అధి క సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
తలనీలాలకు
రూ.31.50లక్షలు
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో సోమవారం నిర్వహించిన వేలంపాటలో తలనీలాలను రూ.31.50లక్షలకు హైదరాబాద్‌కు చెందిన నవీన్ దక్కించుకున్నట్లు ఆలయ ఈఓ సత్యనారాయణ తెలిపారు. వేలంపాటలు దేవాదా య ధర్మాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆర్.సమత సమక్షంలో నిర్వహించారు. అలాగే తూర్పు ద్వారం వద్ద ఉన్న ఖాళీ స్థలంలో పూజా సామగ్రి అమ్ముకునేందుకు నిర్వహించిన వేలంలో కురవికి చెందిన నిలుగొండ రాజు రూ.85వేలకు దక్కించుకున్నాడు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి, ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్‌గౌడ్, చిన్నం గణేష్, భిక్షపతి, రజిత, జనార్దన్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నిట్‌తో
బీఐఎస్ ఒప్పందం
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌తో బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్) సోమవారం పరస్పర ఒప్పందం కుదుర్చుకుంది. బీఐఎస్ 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర వినియోగదారుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో వరంగల్ నుంచి నిట్ డైరెక్టర్ బిద్యాదర్ సబుదీ ఆన్‌లైన్‌లో ఒప్పందం కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో వినియోగదారుల మంత్రిత్వశాఖ కార్యదర్శి నిధి ఖారే, బీఐఎస్ డీజీ ప్రమోద్ కుమార్ తివారి, హైదరాబాద్ శాఖ డైరెక్టర్ పీవీ. శ్రీకాంత్, నిట్ ప్రొఫెసర్లు శ్రీనివాసచార్య, రతిష్ కుమార్, వేణువినోద్ తదితరులు పాల్గొన్నారు.
25నుంచి పీజీ మూడో
సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పీజీ కోర్సుల (నాన్ ప్రొఫెషనల్) మూడో సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) ఈనెల 25వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బీఎస్‌ఎల్ సౌజన్య సోమవారం తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్‌ఆర్‌ఎం తదితర పీజీ కోర్సుల మూడో సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్‌ను విడుదల చేశారు. ఈ పరీక్షలు ఈనెల 25, 27, 29, 31, ఫిబ్రవరి 3, 5 తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని తెలిపారు. పూర్తి వివరాలు కేయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment