మాది చేతల ప్రభుత్వం
నయీంనగర్: తమది చేతల ప్రభుత్వమని, మోసం చేసి దోచుకుని మాయమాటలు చేప్పేది కాదని, రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు పంచుతామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మొదటి సంవత్సరం 4.5 లక్షల ఇళ్లు ఇస్తామని చెప్పారు. సోమవారం హనుమకొండ ‘కుడా’ మైదానంలో టీజీఆర్‌టీసీ వరంగల్ రీజియన్‌కు చెందిన 50 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి పొంగులేటి ప్రారంభించారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రజలకు మంచి చేసినా ఓర్వలేక విమర్శిస్తున్నారని, 2014 ముందు కాంగ్రెస్ హయాంలో 25లక్షల ఇళ్లు నిర్మించామని గుర్తుచేశారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఆశల మేరకు చేస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్‌టీసీని దండగగా మార్చే ప్రయత్నం చేయగా.. తమ ప్రభుత్వం పండుగ వాతావరణంలోకి తెచ్చిందన్నారు. పర్యావరణ హితమైన 1,000 ఎలక్ట్రిక్ బస్‌లను కొనుగోలు చేసిన ప్రభుత్వం వరంగల్ రీజియన్‌కు 112 కేటాయించిందని, తొలివిడతలో 50 బస్‌లు ఇవ్వగా సంక్రాతి పండుగకు మరో 30 వస్తాయన్నారు. ఎలక్ట్రిక్ బస్‌లు జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు నడుస్తాయని తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రతిపక్షాలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనపడుతున్నా విధి లేక విమర్శలు చేస్తున్నాయని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
ఊబర్‌ను తీసుకొచ్చి ఆటో వాళ్లకు అన్యాయం చేసింది కేటీఆర్ అన్నారు.కార్యక్రమానికి ముందు వేదికపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫొటో లేకపోవడంతో గమనించిన అధికారులు ఆయన ఫొటో అతికించారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, కేఆర్.నాగరాజు,‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్య శారద, ప్రావీణ్య, గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు పంచుతాం
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ,
సమాచార శాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఆర్టీసీని అభివృద్ధిలోకి తెచ్చాం :
మంత్రి పొన్నం ప్రభాకర్
హనుమకొండలో
ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment