రైతులను మోసంచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
కేసముద్రం: మాయమాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసంచేసిందని మానుకోట మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. రైతుభరోసా రూ.15వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట ప్రధాన రహదారిపై బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా కింద రూ.15వేలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు రూ.12వేలు ఇస్తామంటూ రైతులను మోసం చేసిందన్నారు. అదే విధంగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేయలేదన్నారు. గిరిజన, దళిత రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వారికే అన్యాయం చేస్తుందని విమర్శించారు. లగచర్లలో గిరిజన రైతులపై పెట్టిన కేసులను వెంటనే కొట్టివేయాలన్నారు. రైతుభరోసా రూ.15వేలతోపాటు, ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వం వెంట పడతామని, తెలంగాణ ప్రజలకు తాము అండగా నిలిచి పోరాడుతామని పేర్కొన్నారు. కేసముద్రం పీఏసీఎస్ చైర్మన్ దీకొండ వెంకన్న, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎండి.నజీర్‌అహ్మద్, ప్రధాన కార్యదర్శి కముటం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు గుగులోతు వీరునాయక్, జాటోత్ హరీశ్‌నాయక్, మోడెం రవీందర్‌గౌడ్, ఊకంటి యాకూబ్‌రెడ్డి, గుంజపొడుగు కొమ్మన్న, కొమ్ము రాహుల్, సట్ల వెంకన్న, దుబాకుల వెంకన్న, దార్ల రామ్మూర్తి, శ్రీధర్, రఫీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్
బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో
రాస్తారోకో
Comments
Please login to add a commentAdd a comment