ఓరుగల్లు ఓటర్లు @30.43 లక్షలు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్‌లో ఓటర్ల సంఖ్య 30,43,540లకు చేరింది. పురుషులు, మహిళలు, ఇతరులు, సర్వీసు ఓటర్లు కలిపితే 30.44 లక్షలకు చేరగా.. సోమవారం ప్రకటించిన తుది జాబితాలో ఈసారీ మహిళలదే అగ్రస్థానం. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పురుషులతో పోలిస్తే మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మొత్తం 30,43,540 మంది ఓటర్లు ఉంటే, అందులో పరుషులు 14,89,606 కాగా, మహిళ ఓటర్లు 15,51,289 ఉన్నారు. ఇతరు(థర్డ్‌జండర్)లు 504 కాగా, సర్వీసు ఓటర్లు 2141. కొత్తగా నమోదైన మహిళ ఓటర్లు.. పురుషులతో పోలిస్తే 61,683 మంది ఎక్కువగా ఉన్నారు.
కూడికలు..తీసివేతలు..
ఎన్నికల సంఘం ఏటా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం కింద మార్పులు, చేర్పులతో ఓటరు జాబితాను తయారు చేస్తూ ఉంటుంది. కిందటేడాది అక్టోబరు 29న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. సవరణలు, మార్పులు, చేర్పులకు కిందటి డిసెంబర్ 31వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. అభ్యంతరాల అనంతరం సోమవారం తుది జాబితాను విడుదల చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా 12 నియోజకవర్గాల పరిధిలో 9,241 ఓటర్లను తొలగించి, కొత్తగా 11,882 మంది ఓటర్లను చేర్చుకున్నట్లు ఈ జాబితాలో వెల్లడించారు. ఇదిలా వుండగా గతేడాదితో పోలిస్తే 62,190 మంది ఓటర్లు పెరగగా.. అక్టోబర్ 29న ప్రకటించిన ముసాయిదా, తుది ఓటర్ల జాబితాకు 10,782 మంది పెరిగారు. రెండు నెలల వ్యవధిలో 10,782 మంది కొత్త ఓటర్లు తమ ఓటుహక్కును నమోదు చేసుకోవడం విస్తృత ప్రచారమే కారణమని ఎన్నికల సంఘం ప్రకటించింది.
పురుషులకన్నా మహిళలే అధికం
మార్పులు, చేర్పుల అనంతరం
తుది జాబితా
విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
12 నియోజకవర్గాల్లో పెరిగిన ఓటర్లు
తొలగించినవి 9,241..
చేర్చినవి 17,882
పోలింగ్ స్టేషన్లు
3,318
ఇతరులు
504
సర్వీస్ ఓటర్లు
2,141
Comments
Please login to add a commentAdd a comment