మహనీయుల ఆశయ సాధనకు పాటుపడాలి
మహబూబాబాద్: మహనీయుల ఆశయసాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పాత బజార్‌లో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద, కొమురంబీమ్ విగ్రహాలను శనివారం ఎమ్మెల్యే మురళీనాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా పోరాటం చేసిన గొప్ప యోధుడు కొమురంబీమ్ అన్నారు. స్వామి వివేకానంద ఆశమ సాధన కోసం యువకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలు కూడా స్వామి వివేకానంద బోధనకు ఆకర్షితులయ్యారన్నారు. అనంతరం ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ రాజకీయాలకు కతీతంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. అనంతరం పెనుకముత్తుదోర సతీమణి సుశీలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రా మ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ మార్నెని వెంకన్న, కమిషనర్ నోముల రవీందర్, డీఈ సీహెచ్ ఉపేందర్, చిట్యాల జనార్దన్, సోమయ్య, అజయ్‌సారదిరెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్
Comments
Please login to add a commentAdd a comment