మేడారంలో భక్తుల సందడి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద బ్యాటరీ ఆఫ్ ట్యాప్‌ల వద్ద స్నానాలు చేశారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీర, సారె, ఒడిబియ్యం, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు నిర్వహించారు. మొక్కుల అనంతరం భక్తులు వంటావార్పు చేసుకున్నారు. 10వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment