కేసముద్రం: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక రాష్ట్ర చైర్మన్ గోధుమల కుమారస్వామి డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులందరికీ నివాస స్థలాలు కేటాయించి, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పింఛన్ మంజూరు చేయాలన్నారు. అనంతరం ఉద్యమకారుల పలు డిమాండ్‌లపై తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో సంఘం మండల ఫోరం అధ్యక్షుడు చాగంటి కిషన్, కన్వీనర్ రామ్మూర్తి, భారత్ బచావో జాతీయ కమిటీ సభ్యుడు జైసింగ్ రాథోడ్, సీపీఐ(ఎంఎల్)మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గడ్డం సదానందం, పీసీసీ సభ్యుడు దస్రూనాయక్, బట్టు శ్రీను, మహేశ్వరాచారి, మాంకాల కట్టమల్లు, షేక్ ఖాదర్, దండు శ్రీనివాస్, రాజ్‌కుమార్, రేవంత్, మురళి, అంకూస్, మధుకర్, యాకన్న, చిట్యాల వీరన్న, బాలు మోహన్, నర్సింహరెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
టీసీసీ టెక్నికల్ పరీక్షలు
మహబూబాబాద్ అర్బన్: టీసీసీ టెక్నికల్ కోర్సు సర్టిఫికెట్ల పరీక్షలు ఈ నెల 11నుంచి 17వరకు నిర్వహిస్తామని డీఈఓ రవీందర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్, గుమ్ముడూరు బాలికల పాఠశాల, ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో www.bse.telangana.govt.in వెబ్‌సైట్‌లో జిల్లా పేరు, ట్రేడ్ కోడ్, పేరు, జనన ధ్రువీకరణ తేదీని నమోదు చేసుకొని హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ఏసీజీఈ మందుల శ్రీరాములు 9849761012 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలన్నారు.
ఎస్‌ఎల్‌టీఏ జిల్లా కమిటీ
మహబూబాబాద్ అర్బన్: రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం (ఎస్‌ఎల్‌టీఏ) జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు చక్రవర్తులు శ్రీనివాసులు, ప్రధాన కార్యాదర్శి కర్రెం గౌరిశంకర్ ఆదివారం తెలిపారు. అధ్యక్షుడిగా ముడుంబై ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా శీలమంతు అమర్, కార్యవర్గ సభ్యులుగా రామచంద్రు, సత్యం, విలియమ్స్, సురేష్, ప్రసాద్, యుగంధర్, మోహన్, వహీద్, శ్రీనివాస్, మహిళా సభ్యులుగా మంజుశ్రీ, సంగీత, సునీత, అరుణను ఎన్నుకున్నారు. అదేవిధంగా గుర్రాల ఉమారాణిని రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు●
వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలో ఎవరైనా ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాలు విక్రయించినా.. వినియోగించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. గాలి పటాల విక్రయదారులు అమ్ముతున్న నైలాన్, నింథటిక్ దారాలతో తయారు చేసిన చైనా మాంజాలు మనుషులతో పాటు పక్షులకు ప్రమాదకరమని పేర్కొన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పర్యావరణ విపత్తుకు కారణమయ్యే చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ట్లు చెప్పారు. కొద్ది రోజులుగా టాస్క్‌ఫోర్స్, పోలీసుల ఆధ్వర్యాన నిర్వహించిన తనిఖీల్లో సుమారు రూ.2.65 లక్షల విలువైన చైనా మాంజాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
ప్రాధాన్యతను కోల్పోని శతక ప్రక్రియ
హన్మకొండ కల్చరల్ : పన్నెండవ శతాబ్దంలో తెలుగుభాషలో మొదలైన శతక ప్రక్రియ నేటి వరకు తన ప్రాధాన్యత కొల్పోకుండా సమాజాన్ని ప్రభావితం చేస్తున్నదని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆచార్య బన్న అయిలయ్య అన్నారు. ఆదివారం హనుమకొండలోని ప్రాక్టీసింగ్ ప్రైమరీ స్కూల్‌లో కాకతీయ పద్యకవితా వేదిక ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో చిదిరాల సుధాకర్ రచించిన పద్య పంచశతకము శ్రీజీవనపోరాటంశ్రీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కవి సమ్మేళనంలో 30 మంది కవులు తమ కవితలతో అలరించారు. సమస్యాపృచ్చక చక్రవర్తి కంది శంకరయ్య అధ్యక్షతన జరిగిన పుస్తక సమీక్షకులుగా చేపూరి శ్రీరాం, కేయూ తెలుగు అధ్యాపకులు డాక్టర్ మంథని శంకర్ పాల్గొన్నారు.
ప్రవీణ్ కుమార్,
అధ్యక్షుడు
అమర్,
ప్రధానకార్యదర్యి
Comments
Please login to add a commentAdd a comment