ఆపదలో ఆమె!
సోమవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2025
– 8లోu
● ఆందోళనకరంగా లింగ నిష్పత్తి
● 1000మంది పురుషులకు 836మంది మహిళలు
● రాష్ట్రంలో చివరి స్థానంలో మహబూబాబాద్
● తేల్చి చెప్పిన ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ సర్వే
● జిల్లా పరిస్థితిపై ఎన్‌ఐఎంసీ సీరియస్
సాక్షి, మహబూబాబాద్: సృష్టికి మూలం సీ్త్ర, అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. అయితే లింగనిష్పత్తి మాత్రం వెనకబడిపోతున్నారు. ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో సీ్త్ర, పురుషుల సెక్స్‌రేషియోలో భారీ వ్యత్యాసం ఉందని తేలింది. లింగ నిష్పత్తిలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత దేశం కాస్త వెనకబడి ఉండగా.. దేశంలో బాలికల జనంలో తెలంగాణ రాష్ట్రం వెనకబడి ఉంది. రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా చిట్టచివరి స్థానంలో ఉన్నట్లు తేలింది. దీంతో మహబూబాబాద్ జిల్లాలో ఎందుకిలా అవుతుందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసి.. ప్రత్యేక బృందాలను జిల్లాకు పంపించి కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.
రాష్ట్రంలో చివరి స్థానంలో జిల్లా..
రాష్ట్రంలోని 33జిల్లాల్లో లింగ వ్యత్యాసంలో జిల్లా చివర అంటే 33వ స్థానంలో ఉంది. ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో లింగ నిష్పత్తి భారతదేశంలో ప్రతీ వెయ్యి మంది పురుషులకు 894 మహిళలు, రాష్ట్రంలో 879 మహిళలు ఉన్నారు. అయితే రాష్ట్రంలో అతి తక్కువగా మహబూబాబాద్ జిల్లాలో ప్రతీ వెయ్యిమంది పురుషులకు 836మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు.
కారణాలు ఇవే కావచ్చు..
జిల్లాలో మహిళల నిష్పత్తి తగ్గడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. ప్రధానంగా జిల్లాలో 60శాతానికిపైగా జనాభా గిరిజన, ఆదివాసీలు ఉండటం, అక్షరాస్యత తక్కువగా ఉండటం.. దీంతో మగ సంతానం కావాలనే ఆలోచనతో ఉంటున్నారు. ఈక్రమంలో గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు చేసి ఆడపిల్ల అని తేలితే గర్భంలోనే చిదిమేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలోని కురవి, మహబూబాబాద్, తొర్రూరులో వెలుగు చూశాయి. వీటిని నిరోధించాల్సిన అధికారులు మామూళ్లకు ఆశపడి పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.
ఎన్‌ఐఎంసీ సీరియస్
మహబూబాబాద్ జిల్లాలో లింగ నిష్పత్తి తగ్గడాన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ సీరియస్‌గా పరిగణించింది. అసలు విషయం తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని మానుకోటకు పంపించారు. ఇందులో భాగంగా డిసెంబర్ 19న ఢిల్లీ బృందం మహబూబాబాద్ వచ్చి పలు స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసి సీజ్ కూడా చేసింది. అదేవిధంగా జిల్లాలోని భ్రూణ హత్యలు నివారించలేకపోవడంపై అధికారులపై కూడా కేంద్ర బృందం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
సమీక్షలు
లింగ నిష్పత్తిలో రాష్ట్రంలో జిల్లా వెనకబడి ఉండటం, ఉన్నతాధికారుల స్థాయిలో తీవ్ర చర్చ జరిగి జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో ముందుగా జిల్లాలోని పీఎన్‌డీటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. తర్వాత జిల్లా వైద్యాధికారి కమిటీ సభ్యులతో సమీక్షలు చేసి లింగ నిర్ధారణ కేంద్రాలను తరచూ తనిఖీలు చేయడం, నిఘా పెంచడంపై ప్రత్యేక కమిటీని వేసినట్లు సమాచారం. ఈ కమిటీలో మాతాశిశు ఆరోగ్య కేంద్రం ప్రోగ్రాం ఆఫీసర్, సీ్త్ర వైద్య నిపుణులు, తహసీల్దార్, పోలీస్ అధికారి ఉండేలా చూశారు. వీరందరూ ప్రతీ నెలలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 59 స్కానింగ్ సెంటర్లను తనిఖీలు చేయడం, గర్భస్థ లింగనిర్ధారణ చేస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు.
●
836మంది
మహిళలు
స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా
జిల్లాలో సీ్త్ర, పురుషుల లింగ నిష్పత్తిలో తేడా రావడానికి ప్రధాన కారణం లింగ నిర్ధారణ పరీక్షలు చేయడమే. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక కమిటీ వేస్తున్నాం. లింగనిర్ధారణ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
–మురళీధర్, డీఎంహెచ్‌ఓ
ఆందోళనకరమే..
సీ్త్ర, పురుషుల జనన నిష్పత్తిలో జిల్లా చివరి స్థానంలో ఉండటం ఆందోళనకరమైన విషయం. భవిష్యత్‌లో మహిళల కొరత ఏర్పడుతుంది. దీనిని అరికట్టకపోతే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. లింగనిర్ధారణ పరీక్షలు చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలి. సీ్త్ర, పురుషులు ఇద్దరు సమానమే అని ప్రజల్లో చైతన్యం తేవాలి.
–జగదీశ్, పీఎన్‌డీపీ సభ్యుడు
ప్రజల్లో చైతన్యం కల్పిస్తాం
సృష్టికి మూలం సీ్త్ర, బాలికల జనాభా తగ్గడం అంటే సృష్టికి విఘాతం కల్గినట్లే. దీనిని సీ్త్ర, పురుషులు అనే తేడా లేకుండా అందరం బాధపడాల్సింది. ప్రధాన కారణం మగ సంతానం కోసం తాపత్రయ పడటమే. ఇద్దరు సమానం అనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. లింగనిర్ధారణ పరీక్షలు చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలి.
–నాగవాణి, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్
న్యూస్‌రీల్
1000మంది
పురుషులకు
Comments
Please login to add a commentAdd a comment