మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
మహబూబాబాద్ అర్బన్: మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్ నుంచి మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ..స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్‌లు ఏర్పాటుచేసి 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఇప్పటికే ఇంధనశాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తేనే వారి ఎదుగుదలకు అవకాశాలు ఏర్పడుతాయని తెలిపారు. మహిళలకు అధికంగా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని, వారు వివిధ వ్యాపారాలు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి వసతులు కల్పించాలని ఆదేశించారు. సోలార్ పవర్ ప్లాంట్‌ల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న భూమిని గుర్తించాలన్నారు. సోలార్ విద్యుత్ అందుబాటులోకి వస్తే అటవీ ప్రాంతాల్లోని రైతులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెద్ద ఎత్తున పంటలు సాగు చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. కేంద్ర పథకంలో భాగంగా రైతులు రెండు మెగావాట్ల వరకు సోలార్ పవర్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉందని, ఈ దిశగా రైతులను చైతన్యం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఎఫ్‌ఓ బి.విశాల్, డీఆర్‌డీఓ మధుసూదన్ రాజు, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ నరేష్, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ దేశిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Comments
Please login to add a commentAdd a comment