గురువారం శ్రీ 9 శ్రీ జనవరి శ్రీ 2025
– 8లోu
పరీక్షలు ఎప్పుడంటే..
ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 3వ తేదీనుంచి, పబ్లిక్ పరీక్షలు మార్చి 5వ తేదీనుంచి, పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21వ తేదీనుంచి ప్రారంభమవుతాయి.
ముగిసిన శిక్షణ
కేసముద్రం: మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో నేల, నీటి సంరక్షణపై ఏఈఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం రెండోరోజు బుధవారం ముగిసింది. హైదరాబాద్ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణలో వలంటరీ డైరెక్టర్ విజయగౌరీ, డీఏఓ విజయనిర్మల పలు అంశాలపై వివరించారు. అనంతరం శిక్షణ పొందిన జిల్లాలోని ఏఈఓలకు ట్రైనింగ్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో డీహెచ్‌ఎస్‌ఓ మరియన్న, ఏడీఏ శ్రీనివాసరావు, కేవీకే మల్యాల శాస్త్రవేత్త క్రాంతి, వలంటరీ ఏడీఏ సునీత, అన్నపూర్ణ, ఏఓ వెంకన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.
సేవాలాల్ జయంతికి సెలవు మంజూరు చేయాలి
మహబూబాబాద్ అర్బన్: సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని ఫిబ్రవరి 15న సాధారణ సెలవు ప్రకటించాలని గోర్‌సేన రాష్ట్ర కోశాధికారి బోడ హరిలాల్ నాయక్ కోరారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌కు బుధవారం గోర్‌సేన రాష్ట్ర నాయకులు వినతిప్రతం అందజేశారు. ఈ కార్యక్రమలో నాయకులు రమేష్ నాయక్, బాబురావు నాయక్, బాలు తదితరులు పాల్గొన్నారు.
మైనర్లు వాహనాలు నడిపితే కేసులు
మహబూబాబాద్ అర్బన్: మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని జిల్లా రవాణాశాఖ అధికారి జైపాల్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని వర్సటైల్ హైస్కూల్‌లో బుధవారం రోడ్డు భద్రతా మాసోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు తెలుసుకోవాలని, మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించొద్దని, తెలిసి తెలియని డ్రైవింగ్‌తో ప్రమాదాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారులు సాయిచరణ, వెంకట్‌రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ ఖలీద్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నిషేధిత ఔషధాలు అమ్ముతున్న ఒకరి అరెస్ట్
ఎంజీఎం: వరంగల్ పోస్టాఫీస్ సమీపంలోని గుడ్ హెల్త్ మెడికల్ షాపులో డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీసులు, ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నిషేధించిన మత్తు ట్యాబెట్లను ప్రిస్క్రిప్షన్ లేకుండా యువతకు విక్రయిస్తున్నట్లు గుర్తించి.. నిషేధిత ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మందుల షాపు యజమానిని అదుపులోకి తీసుకుని ఇంతేజార్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. తనిఖీల్లో ఇన్‌స్పెక్టర్ సురేశ్, ఆర్‌ఐ శివకేశవులు, వరంగల్ డ్రగ్ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ అరవింద్‌కుమార్, ఆర్‌ఎస్సై పూర్ణ, డ్రగ్ కంట్రోల్ పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
గట్టమ్మ హుండీల లెక్కింపు
ములుగు రూరల్: ములుగు జిల్లా కేంద్రంలో గట్టమ్మ ఆలయ హుండీల లెక్కింపు ప్రక్రియను దేవాదాయశాఖ అధికారులు బుధవారం చేపట్టారు. ఈ మేరకు దేవాదాయశాఖ ఈఓ బిళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గట్టమ్మ హుండీల ద్వారా ఆదాయం రూ.1,93,838 వచ్చిందని తెలిపారు. ఇందులో రూ.1,81,555 నోట్ల రూపంలో లభించగా రూ.12,283 నాణేల రూపంలో వచ్చాయని తెలిపారు. దేవాదాయ శాఖ పరిశీలకులు కవిత, పూజారుల లక్ష్మయ్య, ఆర్‌ఐ యుగేంధర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పుష్కరాలపై సమీక్ష
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో నిర్వహించే కుంభాభిషేకం, సరస్వతినది పుష్కరాలపై దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్ అధ్యక్షతన శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నట్లు ఈఓ మారుతి బుధవారం తెలిపారు. కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి క్షేత్రస్థాయిలో కాళేశ్వరం దేవస్థానాన్ని సందర్శించి సమీక్షలో పాల్గొంటారని తెలిపారు. ఫిబ్రవరిలో మహాశివరాత్రికి ముందే శృంగేరి పీఠాధిపతి, అతడి శిష్య బృందంతో కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మే 15న జరిగే సరస్వతి నది పుష్కరాల ఏర్పాట్లపై చర్చించి ప్రణాళికలు చేయనున్నారు.
12,006 19,468 20,387
ములుగు
హనుమకొండ
వరంగల్
జనగామ
మహబూబాబాద్
{
ఇంటర్
ఇవి దూరంగా పెట్టండి..
● ఏకాగ్రతను దెబ్బతీసే టీవీ, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలి. మొబైల్‌ఫోన్లలో గేమ్స్ ఆడడం వంటివి చేయొద్దు.
● సినిమాలకు, అనవసర ఫంక్షన్లకు, విందులు వినోదాలకు దూరంగా ఉంటే మంచిది.
● చదువు విషయంలో రేపు చూద్దాం.. గంట తరువాత చదువుదాంలాంటి బద్దకం, నిర్లక్ష్యం వహించద్దు.
● తమ సహచర విద్యార్థులతో వివిధ సబ్జెక్టుల్లోని విషయాలను చర్చించాలి కానీ.. సంబంధంలేని విషయాలను వదిలేయాలి.
పరీక్ష రాసే సమయంలో..
● ప్రశ్నలను పూర్తిగా చదవడం: ప్రశ్నలను అర్థం చేసుకుని సమాధానం ఇవ్వండి.
● సమర్థంగా సమాధానం రాయాలి. ప్రశ్నల ప్రాధాన్యాన్ని గుర్తించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
● రివిజన్: సమాధానాలను తిరిగి చూసి, తప్పులను సరిచేసుకోవాలి.
అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి
● ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి
పాలకుర్తి టౌన్: దేవాలయాల అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఝాన్సీరెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్‌తో కలిసి నియోజకవర్గ పరిధిలోని దేవాదాయ ధర్మాదాయ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వల్మిడి సీతారామచంద్రస్వామి అభివృద్ధి పనులపై శ్రద్ధ వహించాలని, స్మృతి వనం అభివృద్ధి పనులకు టెండర్లు పిలవాలని, దేవరుప్పుల మండలం కడవెండి వానకొండయ్య గుట్ట, చెన్నూరు ఆలయాల అభివృద్ధి పనులకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపించాలన్నారు. బమ్మెర పోతన, సోమేశ్వరాలయం, అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ.. దేవాలయాల అభివృద్ధికి ఆదాయ వనరులు మరింతగా పెంచేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో ఆలయ సిబ్బంది పనితీరు సరిగా లేదని, పద్ధతి మార్చుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాములు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న డీడీ పోచం, పక్కన అధికారులు
● ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పోచం
ఏటూరునాగారం: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పీఎం కుసుమ్ పథకాన్ని గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ డిప్యూ టీ డైరెక్టర్ పోచం అన్నారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆదేశాల మేరకు ఏటూరునాగారం ఐటీడీఏ సమావేశ మందిరంలో పీఎం కుసుం పథకంపై పెసా మొబిలైజర్లకు అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా యూనిట్లను పెట్టేందుకు పక్కా ప్రణాళికను కేంద్రం చేపడుతుందన్నారు. అందులో భాగంగానే 4ఎకరాల భూమి కలిగి ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా లేదా రెవెన్యూ పట్టా కలిగి ఉండాలన్నారు. అలాగే విద్యుత్ సబ్ స్టేషన్‌కి ఐదు కిలోమీటర్ల దూరంలోని భూములను 25 సంవత్సరాల పాటు లీజుకు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆ భూములకు ఏడాదికి ఎకరానికి రూ.12,500 చెల్లించనున్నట్లు తెలిపారు. ఆ భూమిలో సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. ఈ విధంగా నెలకొల్పిన సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను స్వయం సహాయక సంఘాల ద్వారా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకంపై ఆసక్తి కలిగిన ఆర్‌ఓఎఫ్‌ఆర్ లేదా రెవెన్యూ పట్టా కలిగిన రైతులు మరిన్ని వివరాల కోసం ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఏఓ రాజ్‌కుమార్, ఏటీడీఓ క్షేత్రయ్య, తహసీల్దార్ జగదీశ్వర్, ఎస్‌ఓ సురేష్‌బాబు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ డీటీ అనిల్, ఏఈ అశోక్ పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment