చెత్త తొలగించారు..
మహబూబాబాద్ అర్బన్: మానుకోట మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని కార్మికులు తొలగించారు. బుధవారం సాక్షి దినపత్రికలో ‘పారిశుద్ధ్యం.. అస్తవ్యస్తం’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి మున్సిపల్ చైర్మన్, కమిషనర్ స్పందించారు. జిల్లా కేంద్రంలోని పలు సెంటర్లలో చెత్తాచెదారం తొలగించడంతోపాటు కాల్వల పూడిక తీయించారు. ఈ సందర్భంగా చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. మానుకోట మున్సిపల్ పరిధిలో పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ ఖాళీ స్థలాల్లో వేయవద్దని సూచించారు. మున్సిపల్ వాహనాల్లోనే చెత్తను వేయాలన్నారు. మున్సిపల్ కార్మికులు సైడ్ డ్రెయినేజీలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచి బ్లిచింగ్ పౌడర్ చల్లాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment