వివాదాల్లో విలువైన భూములు
మహబూబాబాద్: జిల్లా కేంద్రం నడిబొడ్డున విలువైన భూములు వివాదాల్లో ఉన్నాయి. వందల కోట్ల విలువైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఇటీవల సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళ న కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఆ పార్టీ నాయకులతో పాటు మానుకోట మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఇందిరాగాంధీ సెంటర్‌లోని ఓ స్థలం విషయంలో కొ న్ని సంవత్సరాల క్రితం రగడ జరగగా.. మళ్లీ తెరపై కి వచ్చింది. ఆఫీసర్ క్లబ్ స్థలం వివాదంలో ఉంది.
ఆఫీసర్ క్లబ్‌స్థలం..
జిల్లా కేంద్రంలోని కొత్తబజార్ 36వ వార్డు పరిధిలో సుమారు రెండెకరాల స్థలంలో ఆఫీసర్ క్లబ్ ఉంది. అక్కడి భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఆ ప్రాంతంలో గజం ధర లక్షల్లోనే ఉంది. కాగా ఆ స్థలం విలువ రూ.50కోట్లపైనే ఉంటుంది. గతంలో ఆఫీసర్ క్లబ్ స్థలంతో పాటు దాని పక్కనే వ్యవసాయశాఖకు సంబంధించిన కార్యాలయాలు, గోదాంలు ఉండేవి. కాగా క్లబ్ స్థలం విడిచిపెట్టి.. కార్యా లయాలు, గోదాంల స్థలంలో మోడల్ మార్కెట్ నిర్మాణానికి పూనుకున్నారు. కాగా క్లబ్ స్థలం కబ్జాకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీపీఐ ఆందోళన బాటపట్టింది. దీనిలో భాగంగానే ఇటీవల క్లబ్ ఆవరణలోనే సీపీఐ నాయకులు ఆందోళన చేశారు. అది ఆఫీసర్ క్లబ్ కాదని.. 1930లో వేసిన శిలాఫలకంపై మానుకోట క్లబ్‌గా ఉందని, కానీ కొంత మంది దానిని ఆఫీసర్ క్లబ్‌గా మార్చారని, వెంటనే దానిని స్వాధీనం చేసుకుని మున్సిపాలిటీకి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో షాపింగ్ క్లాంపెక్స్‌తో పాటు కళాక్షేత్రం, ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాని ఆందోళన చేశారు. అలాగే మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న ఆధ్వర్యంలో కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
ఇందిరాగాంధీ సెంటర్‌లో 2000 గజాల స్థలం
ఇందిరాగాంధీ సెంటర్‌లో సుమారు 2000 గజాల స్థలం వివాదంలో ఉంది. ఆ స్థలం తమదేనని కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో 2019 అక్టోబర్‌లో వేలం వేసేందుకు ఫెన్సింగ్ వేశారు. ఈ స్థలం విషయంలో ఆప్పటి మున్సిపాలిటీ అధికారులు, పాలక మండలితో పాటు సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆ సమయంలో బ్యాంక్ అధికారులకు మున్సిపాలిటీ తరఫున నోటీస్‌లు ఇచ్చారు. స్థలం మాదంటే మాదే అని.. ఇటు మున్సిపాలిటీ అటు కోఆపరేటివ్ బ్యాంక్ అధికారులు వాదనకు దిగారు. అనంతరం గొడవ సద్దుమణిగింది. ప్రస్తుతం ఆ స్థలంలో ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. దాని విలువ కూడా రూ.50 కోట్లకు పైనే ఉంది. కాగా ఇటీవల ఆ స్థలం కబ్జాకు గురికాకుండా చూడాలని మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆ స్థలం ముమ్మాటికి మున్సిపాలిటీదేనని, తమకు కేటాయిస్తే షాపింగ్ క్లాంపెక్స్ నిర్మాణం చేపడుతామని వినతిలో పేర్కొన్నారు. కాగా స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని, కలెక్టర్, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుంటే ఆ స్థలాల వివాదాలకు చెక్ పడుతుందని నాయకులు, ప్రజలు అంటున్నారు.
ఎమ్మెల్యే, ఎంపీ ప్రత్యేక చొరవ
తీసుకోవాలి
ఆఫీసర్ క్లబ్ స్థలం విషయంలో ఎమ్మెల్యే మురళీనాయక్, ఎంపీ బలరాంనాయక్ ప్రత్యేక చొరవ తీసుకోవాలి. మానుకోట క్లబ్‌ను ఆఫీసర్ క్లబ్‌గా మార్చి దానిని కబ్జా చేసే కుట్రలు చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఆ స్థలంను స్వాధీనం చేసుకొని మున్సిపాలిటీకి కేటాయించి అభివృద్ధి చేయాలి. ఇందిరాగాంధీ సెంటర్‌లోని స్థలంను కూడా గతంలో వేలం వేసే కుట్రలు చేస్తే అడ్డుకున్నాం. వెంటనే ఆ స్థలాలను స్వాధీనం చేసుకొని మున్సిపాలిటీకి కేటాయించాలి.
–బి.అజయ్‌సారథిరెడ్డి
సీపీఐ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్
●
మళ్లీ తెరపైకి మానుకోట
మున్సిపాలిటీలోని స్థలాల ఇష్యూ
ఆఫీసర్ క్లబ్ స్థలం, మరో జాగా
కబ్జాకు యత్నాలు
అన్యాక్రాంతం కాకుండా చూడాలని సీపీఐ ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment