సాంఘిక శాస్త్రమే అన్ని సబ్జెక్టులకు అనుసంధానం
మహబూబాబాద్ అర్బన్: సాంఘిక శాస్త్రమే అన్ని సబ్జెక్టులకు అనుసంధానమని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రవీందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లాస్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభ పాఠవాలను వెలికి తీసేందుకు టాలెంట్ టెస్ట్‌లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇంగ్లిష్ మీడియంలో డి .శివ రాజోలు జెడ్పీహెచ్‌ఎస్, జష్వంత్ ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్, జి. సాయి మరిపెడ జెడ్పీహెచ్‌ఎస్. తెలుగు మీడియంలో శ్రావణి కొత్తపోచారం జెడ్పీహెచ్‌ఎస్, టి. రాజీవ్ గుండ్రాతిమడుగు జెడ్పీహెచ్‌ఎస్, ఎస్. సరిత కేజీబీవీ నర్సింహులపేట విద్యార్థులు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారన్నారు. అనంతరం ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ ఫోరం అధ్యక్షురాలు స్వరూపరాణి, ప్రధానకార్యదర్శి ఉమాదేవి, భిక్షపతి, వీరారెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వందశాతం ఫలితాలు సాధించాలి
గార్ల: పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి రవీందర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం గార్లలోని కస్తూర్భాగాంధీ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం వడ్డించాలని వార్డెన్‌ను ఆదేశించారు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకొని వారి చదువులపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్థేశించిన మెనూను విధిగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. అనంతరం దాతలు మైసా శ్రీనివాస్, బొల్లం శ్రీనివాస్, జి.విజయ్‌కుమార్, టి.వెంకన్న, ఎం.నరసింహరావుల సహకారంతో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను డీఈఓ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంఓ ఎం.రాములు, ఎంఈఓ ఎం.వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ రవీందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment