కొత్త మెనూ అమలు చేయండి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టల్‌లో కొత్త మెనూను అమలు చేయాలని జెడ్పీ సీఈఓ పురుషోత్తం అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థినులకు దుప్పట్లను డీపీఆర్‌ఓ పసునూరి రాజేందర్‌ప్రసాద్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులకు రుచికరమైన భోజనం వడ్డించాలని, శీతాకాలం దృష్ట్యా విద్యార్థులకు దుప్పట్లను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ ఏఎస్‌డబ్ల్యూ శివభాస్కర్‌రావు, వార్డెన్ శ్రీలత, సిబ్బంది పాల్గొన్నారు.
గార్లలో..
గార్ల: విద్యార్థులకు కొత్త మెనూ అమలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్ సూచించారు. శనివారం గార్లలోని ఎస్సీ బాలికలు, బాలురు, కేజీబీవీ, ఆశ్రమ పాఠశాల వసతి గృహాలను ఆయన పరిశీలించారు. వంటగది, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని వార్డెన్లను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీఓ మంగమ్మ, ఎంఈఓ ఎం వీరభద్రం, పంచాయతీ కార్యదర్శి అజ్మీర కిషన్, తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ సీఈఓ పురుషోత్తం
Comments
Please login to add a commentAdd a comment