వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లా ల్ నెహ్రూ స్టేడియంలో 14 రోజులు కొనసాగిన సీఎం కప్ క్రీడా పండుగ గురువారం సాయంత్రం ముగిసింది. ఆరు క్రీడాంశాలలో నిర్వహించిన పో టీల్లో తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 4వేలపై చిలుకు క్రీడాకారులతో పాటు టెక్నికల్ అఫిషీ యల్స్ హాజరైనట్లు హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్ వెల్లడించారు.
రెజ్లింగ్‌లో ఏడు పతకాలు..
ముగింపు వేడుకలకు సీఎం ఓఎస్‌డీ రవీందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రెజ్లింగ్, అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభించారు. హోరాహోరీగా సాగిన రెజ్లింగ్ పో టీల్లో హనుమకొండ క్రీడాకారులు ప్రతిభ చాటి ఏ డు పతకాలను కై వసం చేసుకున్నారు. సబ్‌జూని యర్స్ 60కేజీల విభాగంలో వి. గణేశ్, 53 కేజీల కే టగిరీలో బి. అంజలి, 48 కేజీల విభాగాల్లో గోల్డ్ మె డల్ సాధించారు. ఎస్. అరుజన్‌సాగర్ కాంస్య పత కం సాధించారు. జూనియర్ బాలికల విభాగంలో 50కేజీల బి. ప్రణవి, 59 కేజీల లోజె చిన్ని, 61 కేజీ ల కొర్ర అఖిల్ స్వర్ణ పతకాలు సాధించగా, 57కేజీల విభాగంలో ఎ. రాహుల్ రజత పతకం సాధించా డు. విజేతలను హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్ కుమార్, తెలంగాణ అమోచ్యూర్ రెజ్లింగ్ అ సోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ కరీం, వ రంగల్, హనుమకొండ జిల్లాల రెజ్లింగ్ అసోసియేషన్ల కార్యదర్శులు సుధాకర్, షేక్‌రియాజ్, రెజ్లింగ్ కోచ్‌లు కె.రాజు, ఎం. జైపాల్ అభినందించారు.
ముగిసిన సీఎంకప్ క్రీడా పండుగ
14 రోజులు.. 6 క్రీడాంశాల్లో పోటీలు
రెజ్లింగ్‌లో ఆతిథ్య వరంగల్ జిల్లాకు
ఏడు పతకాలు
అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్‌షిప్
భద్రాద్రికొత్తగూడెం
అథ్లెటిక్స్‌లో నువ్వా?నేనా..
నువ్వా?నేనా అన్నట్లు సాగిన అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం 33 జిల్లాల అథ్లెట్లు పోటీపడగా 86 పాయింట్లతో భద్రాద్రి కొత్తగూడెం ఓవరాల్ చాంపియన్‌షిప్ కై వసం చేసుకుంది. తర్వాత 62 పాయింట్లతో రెండో స్థానంలో ఖమ్మం జిల్లా అథ్లెట్లు నిలిచారు. 46 పాయింట్లతో మూడో స్థానాన్ని హైదరాబాద్ దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment