మారిన పుష్‌పుల్ రైళ్ల నంబర్లు..
కాజీపేట రూరల్ : కాజీపేట, వరంగల్, డోర్నకల్, విజయవాడ, సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే పలు పుష్‌పుల్ రైళ్ల నంబర్లు మారినట్లు కాజీపేట రైల్వే కమర్షియల్ అధికారులు గురువారం తెలిపారు. మారిన పుష్‌పుల్ ట్రైన్ నంబర్లు జనవరి 1వ తేదీ నుంచి అమలు చేసి నడిపిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
నంబర్లు మారిన రైళ్లు ఇవే..
కాజీపేట–డోర్నకల్ (పాత నంబర్ 07753/ కొత్త నంబర్ 67765) పుష్‌పుల్, డోర్నకల్–కాజీపేట (పాత నంబర్ 07754/కొత్త నంబర్ 67766) పుష్‌పుల్, కాజీపేట–సికింద్రాబాద్ (పాత నంబర్ 07757/ కొత్త నంబర్ 67764) పుష్‌పుల్, సికింద్రాబాద్–కాజీపేట (పాత నంబర్ 07758/ కొత్త నంబర్ 67763) పుష్‌పుల్, సికింద్రాబాద్–వరంగల్ (పాత నంబర్ 07462/ కొత్త నంబర్ 67761) పుష్‌పుల్, వరంగల్–సికింద్రాబాద్ (పాత నంబర్ 07463/కొత్త నంబర్ 67762) పుష్‌పుల్.
రైల్వే బ్లాక్‌తో పలు రైళ్ల రద్దు
కాజీపేట–విజయవాడ రూట్‌లో మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులతో పలు రైళ్లను రద్దు చేసి నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
రద్దయిన రైళ్ల వివరాలు
2024 డిసెంబర్ 25వ తేదీ నుంచి 2025 జనవరి 9వ తేదీ వరకు కాజీపేట–డోర్నకల్(07753) పుష్‌పుల్, డోర్నకల్–కాజీపేట (07754) పుష్‌పుల్, జనవరి 5,7,8,9వ తేదీన గుంటూరు–సికింద్రాబాద్ (12705) డైలీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–గుంటూరు (12706) డైలీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, జనవరి 4,7,8,9వ తేదీల్లో విజయవాడ–సికింద్రాబాద్ (12713) డైలీ శాతవాహన ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–విజయవాడ (12714) డైలీ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లు రద్దయినట్లు అధికారులు తెలిపారు.
పలు రైళ్ల దారి మళ్లింపు
జనవరి 8వ తేదీన విశాఖపట్నం–ఎల్‌టీటీ (18519) డైలీ ఎక్స్‌ప్రెస్, జనవరి 6,8వ తేదీల్లో షాలిమార్–హైదరాబాద్ (18045) ఎక్స్‌ప్రెస్, జనవరి 7,9వ తేదీల్లో హైదరాబాద్–షాలిమార్ (18046) ఎక్స్‌ప్రెస్, జనవరి 7వ తేదీన షిర్డీ–కాకినాడ (17205) ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం–షిర్డీ (17208) ఎక్స్‌ప్రెస్, జనవరి 8వ తేదీన కాకినాడ–షిర్డీ (17206) ఎక్స్‌ప్రెస్, షిర్టీ–మచిలీపట్నం (17207) ఎక్స్‌ప్రెస్, జనవరి 6,8వ తేదీల్లో ముంబాయి–భువనేశ్వర్ (11019) కోణార్క్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్–ముంబాయి (11020) కోణార్క్ ఎక్స్‌ప్రెస్, జనవరి 7వ తేదీన సికింద్రాబాద్–షాలిమార్ (12774) ఎక్స్‌ప్రెస్ రైళ్లను వరంగల్, కాజీపేట మీదుగా కాకుండా వయా విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి మీదుగా సికింద్రాబాద్‌కు నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
జనవరి 1 నుంచి అమలు
రైల్వే బ్లాక్‌తో 6 రైళ్లు రద్దు..
11 దారి మళ్లింపు
Comments
Please login to add a commentAdd a comment