అభివృద్ధిలో టెక్నాలజీ భాగం
హన్మకొండ: అభివృద్ధిలో టెక్నాలజీ భాగమైందని, ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుని కంపెనీ అభివృద్ధిలో ముందుకెళ్తోందని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ వరుణ్ రెడ్డిని డైరెక్టర్లు, ఆయా అసోసియేషన్, సంఘాల నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్పీడీసీఎల్‌లో ఇప్పటికే సాంకేతికంగా ఎన్నో మార్పులు తీసుకువచ్చామని, భవిష్యత్‌లో కూడా టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి ఉంటుందని వివరించారు. ప్రతీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌పై 1912 టోల్ ఫ్రీ నంబర్ ముద్రించి విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రతీ ఉద్యోగి నిబద్ధతతో విధులు నిర్వర్తించి కంపెనీ మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, సదర్ లాల్,వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి.జనార్దన్, సీజీఎంలు అశోక్, బీకంసింగ్, కె.ఎన్.గుట్ట, తదితరులు పాల్గొన్నారు.
ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment