విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి
మహబూబాబాద్ అర్బన్: ఇటీవల విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలో ఆదివారం టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నూతన ఉపాధ్యాయులకు ఉద్యమ చరిత్ర, సమకాలిన అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చేపట్టిన ఉమ్మడి ఉద్యమాల నిర్మాణంలో ఏపీటీఎఫ్ క్రియాశీలక పాత్ర పోషించింందన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమమే కాకుండా విద్యారంగ అభివృద్ధి, సామాజిక సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు. అనంతరం టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి మైస శ్రీనివాసులు మాట్లాడుతూ.. నూతన ఉపాధ్యాయులు విద్యారంగ సమస్యలపై అవగాహన పెంచుకోవాలన్నారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలాష్టి రమేశ్, ప్రధాన కార్యదర్శి పులిచింత విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ శ్రీశైలం, ఐలయ్య, సువర్ణ, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, ఉపేందర్, జిల్లా కార్యదర్శులు ఆర్.ఉపేందర్, రవీందర్, జనార్దన్, సబియాభాను, శ్రీలత, వివిధ మండలాల బాధ్యులు రామలింగరెడ్డి, బాబూ రావు, విద్యాసాగర్, విజయ్‌కుమార్ ఉన్నారు.
టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు
నర్సింహారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment