గ్రామ సభలకు ఏర్పాట్లు చేయాలి
మహబూబాబాద్: గ్రామ సభలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని, అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా పథకాలు మంజూరు చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అధికారులు ఆదేశించారు. కలెక్టర్ కా ర్యాలయంలోని సమావేశ మందిరంలో ఆదివారం రాత్రి నాలుగు ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 21నుంచి 24వరకు నిర్వహించే గ్రామ సభలకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామ సభలకు హాజరయ్యే ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. అర్హులైన ప్రతీఒక్కరికి రేషన్‌కార్డు జారీ చేయాలన్నారు. ప్రభుత్వం ఈనెల 26వ తేదీ నుంచి నాలుగు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment