సంక్షేమ పథకాలు అందేలా కృషి
బయ్యారం: మైదాన ప్రాంత గౌడ కులస్తులతో సమానంగా ఏజెన్సీలోని గౌడ కులస్తులకు ప్రభుత్వపరమైన అన్ని సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మండల కేంద్రంలోని గౌడ సంఘం కార్యాలయంలో ఏజెన్సీ ప్రాంతాల గౌడ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఏజెన్సీలోని మిగతా బీసీ కులాలకు సొసైటీలు ఉన్నప్పటికీ గౌడ కులస్తులకు సొసైటీని గత ప్రభుత్వం పునరుద్ధరించలేదన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఏజెన్సీలోని గౌడ కులస్తులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. గౌడ పరిరక్షణ కమిటీ నాయకులు నర్సయ్యగౌడ్, వెంకన్న, వెంకటేశ్వర్లు, సత్యం, రాజన్న, శ్రీను, రాంమూర్తి, నర్సయ్య, రమేశ్, యాకయ్య, రవి, వీరన్న, సారయ్య, వీరవెంకులు, వినయ్‌బాబు, పరదేశి, సురేష్ పాల్గొన్నారు.
ఏజెన్సీ గౌడసంఘం ఆత్మీయ
సమ్మేళనంలో ఎమ్మెల్యే కనకయ్య
Comments
Please login to add a commentAdd a comment