గ్రామస్థాయిలో మెరుగైన వైద్యం
గంగారం: గ్రామస్థాయిలో పేదప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గిరిజన బాలల ఆశ్రమోన్నత పాఠశాలలో మెగా మెడికల్ క్యాంపును ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క హాజరై ప్రారంభించారు. అనంతరం బీపీ చెక్ చేయించుకున్నారు. ఈసందర్భంగా ఏర్పాట చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మారుమూల పల్లె ప్రజలు పట్టణాలకు వెళ్లి వైద్యం చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ఖమ్మం తదితర పట్టణాల నుంచి వైద్యులను రప్పించి పోలీసుల ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. క్యాంపునకు సుమారు ఐదువేల వరకు ప్రజలకు హాజరై వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. హెల్త్ క్యాంపు వద్ద ప్రజలకు భోజన సదుపాయం కల్పించారు. అనంతరం కొత్తగూడ, గూడూరు, గంగారం మండలాల్లో ఇటీవల పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల్లో ఉత్తమ ప్రతిభన కనబర్చిన క్రీడాకారులకు మంత్రి చేతుల మీదుగా బహుమతులు అందించారు. అలాగే వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐఎంఏ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్లనాయక్, మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, మహబూబాబాద్ ఐఎంఏ ప్రెసిడెంట్ జగదీష్, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ ప్రసాద్, ిసీఐలు సర్వయ్య, రవికుమార్, బాబురావు గిరిధర్‌రెడ్డి, ఎస్సైల సతీష్, మురళీధర్‌రాజ్, దీపిక, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లా నారాయణరెడ్డి, కొత్తగూడ, గంగారం మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు వజ్జ సారయ్య, వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ధనసరి సీతక్క
గంగారంలో మెగా హెల్త్ క్యాంపు
Comments
Please login to add a commentAdd a comment