అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య
● గొల్లచర్లలో ఘటన
డోర్నకల్ : అత్తింటి వేధింపులతో మండలంలోని గొల్లచర్లలో వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డింది. డోర్నకల్ సీఐ బి.రాజేశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బానోత్ ఉమ(18) రెండు సంవత్సరాల క్రితం గ్రామంలోని వడ్డెర కాలనీకి చెందిన ఆలకుంట చంటిని ప్రేమ వివాహం చేసుకుంది. సంవత్సరం క్రితం పాప జన్మించినప్పటి నుంచి ఉమకు అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. భర్త చంటితోపాటు అత్త స్వప్న, మామ భద్రయ్య, ఆడపడుచు కావేరి వివిధ రకాలుగా వేధించ సాగారు. పలుమార్లు పంచాయితీ నిర్వహించినా గొడవలు కొనసాగుతుండడంతో ఉమ తన తల్లి వద్దకు వెళ్లింది. ఈ నేపథ్యంలో గత నెల 28న చంటి ఎలుకల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అదే రోజు సాయింత్రం భర్తను చూసేందుకు ఉమ ఆస్పత్రికి వెళ్లగా అత్త, మా మ, తదితరులు ఉమను తీవ్రంగా దూషించారు. దీంతో మనస్తాపానికి గురైన ఉమ పురుగుల మందు తాగి గొల్లచర్లలోని తన ఇంటికి వెళ్లి పడిపోయింది. కుటుంబీకులు వెంటనే ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల ్లవారుజామున మృతి చెందింది. మృతురాలి తల్లి పద్మ ఫిర్యాదు మేరకు డోర్నకల్ పీఎస్‌లో కేసు నమోదు చేయగా మహబూబాబాద్ డీఎస్పీ విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
మద్యం మత్తులో యువకుడు..
శాయంపేట : మద్యం మత్తులో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం శాయంపేటలో జరిగింది. ఎస్సై జక్కుల పరమేశ్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన అబ్బు భాస్కర్ రెడ్డి(33) కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తన భార్య రసన్య బోనాల పండుగకు తల్లిగారింటికి వెళ్లింది. ఈ క్రమంలో బుధవారం మద్యం సేవించి మత్తులో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు రాజిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎౖస్సై పరమేశ్ తెలిపారు.
పురుగుల మందు తాగి వ్యక్తి..
ధర్మసాగర్: మద్యం మత్తులో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం మండలంలోని ధర్మపురంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లక్కాకుల రాజు (44) కొంతకాలంగా మద్యానికి బానిసై తరచూ కుటుంబీకులతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం కూడా మద్యం తాగొచ్చి గొడవ పడ్డాడు. మత్తులో పురుగుల మందు తాగాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment