హమాలీలకు వేతనాలు, బకాయిలు చెల్లించాలి
హన్మకొండ/ వరంగల్ : సివిల్ సప్లయ్ హమాలీ రేట్ల పెంపుపై కుదర్చుకున్న ఒప్పందం మేరకు హమాలీలకు వేతనాలు, బకాయిలు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయీస్ హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.మునీశ్వర్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ సాధనకు సివిల్ సప్లయ్ హమాలీలు నిరవధిక సమ్మె చేపడుతున్నారు. ఇందులో భాగంగా గురువారం హనుమకొండ గోకుల్ నగర్‌లోని సివిల్ సప్లయ్ గోదాం వద్ద, వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లోని సివిల్ సప్లయ్ గోదాంల వద్ద దీక్ష చేపట్టారు. ఈ దీక్షలను జి.మునీశ్వర్ ప్రారంభించి మాట్లాడుతూ 2024 అక్టోబర్ 4న సివిల్ సప్లయ్ కమిషనర్.. హమాలీల సమస్యలపై ఒప్పందం చేసుకున్నారని, మూడు నెలలు గడుస్తున్నా ఒప్పందం మేరకు జీఓ విడుదల చేయాల్సి ఉండగా కాలయాపన చేస్తూ హామీలకు నష్టం చేకూరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం హమాలీల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వేల్పుల సారంగపాణి, ప్రధాన కార్యదర్శి జక్కు రాజు గౌడ్, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేశ్, హమాలీ సంఘం నాయకులు కుక్కల మల్లయ్య, కొనుపుల భిక్షపతి, కన్నబోయిన కుమార్, బోయిని సమ్మయ్య, బోయిని కట్టయ్య, ఆకుల సుధాకర్, దామెర కృష్ణదేవర, రాంబాబు, చంద్రమౌళి, రవి, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయీస్ హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.మునీశ్వర్
Comments
Please login to add a commentAdd a comment