పులి జాడ కోసం అన్వేషణ!
కొత్తగూడ: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో పులి సంచారం ఫారెస్ట్ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రాత్రనక పగలనక అడవుల్లో పులి ఆనవాళ్ల కోసం అన్వేషిస్తున్నారు. కొత్తగూడ మండలంలోని కోనాపురం అడవి సమీపంలోని పొలం గట్లపై పులి అడుగులు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ సెక్షన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పులి ఆనవాళ్ల కోసం తిరుగుతుండగానే వరంగల్ జిల్లా ఖానాపురం మండలం కీర్యతండా సమీపంలోని అటవీ ప్రాంతంలో పులి అడుగులనుస్థానికులు గుర్తించారు. కాగా పులి నుంచి ప్రమాదం వాటిల్లకుండా, స్థానికులతో పులికి హానీ జరగకుండా అటవీ సమీప గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment