బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
మహబూబాబాద్ రూరల్: ప్రతీ ఒక్కరు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పాటుపడాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ నెల 1నుంచి 31వ తేదీ వరకు వరకు నిర్వహించే ఆపరేషన్ స్మైల్ కార్యక్రమ పోస్టర్లను ఎస్పీ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహబూబాబాద్, తొర్రూరు సబ్ డివిజన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలను కృషి చేస్తున్నామన్నారు. 18 సంవత్సరాలలోపు తప్పిపోయిన, కిరాణా షాపులు, మెకానిక్ షాపులు, హోటళ్లు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న బాల కార్మికులతో పాటు రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తిస్తారన్నారు. అనంతరం తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లలను వారికి అప్పగించడం లేదా చైల్డ్ కేర్ హోంనకు పంపిస్తామన్నారు. చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా భిక్షాటన, వెట్టిచాకిరీ చేయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బాలల హక్కుల సంరక్షణ ద్వారానే సంపూర్ణ మానవ అభివృద్ధి సాధ్యమని, ఆదిశగా అధికారులు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మి కులు కనిపిస్తే 1098, డయల్ 100కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సీసీఎస్ సీఐ హతీరాం, డీసీఆర్బీ సీఐ సత్యనారాయణ, ఎస్బీ సీఐ చంద్రమౌళి, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ నాగవాణి, బాలరక్షా భవన్ కోఆర్డినేటర్ లక్ష్మి, సీడబ్ల్యూసీ సభ్యుడు డేవిడ్, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ వెంకటేశ్, సూపర్‌వైజర్ కల్యాణి, కానిస్టేబుల్ సుప్రజ, అధికా రులు, సిబ్బంది, ఆపరేషన్ స్మైల్ బృంద సభ్యులు పాల్గొన్నారు.
చైనా మాంజా విక్రయిస్తే చర్యలు..
ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ హెచ్చరించారు. జిల్లా పరిధిలో చైనా మాంజా విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు శుక్రవారం తెలిపారు. చైనా మంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందని, చైనా మాంజాతో తలెత్తే అనర్థాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. చైనా మాంజాను అమ్మినా, రవాణా చేసినా సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు ఫోన్ చేసి తెలపాలని సూచించారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
Comments
Please login to add a commentAdd a comment